2019 ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పుతాః గ‌ద్ద‌ర్‌

Update: 2017-06-07 11:53 GMT
రాబోయే ఎన్నికల్లో చ‌క్రం తిప్పేది  తానేన‌ని  ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ అన్నారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పార్టీ నుంచి బయటకొచ్చాన‌ని చెప్పారు. అనేక పోరాటాల ఫ‌లితంగా సాధించుకున్న‌ తెలంగాణ కేవలం భౌగోళిక‌మైన‌దేన‌న్నారు. 2019 ఎన్నిక‌ల్లో కొన్ని రాజకీయ పార్టీల‌తో పొత్తులు పెట్టుకుంటామ‌ని తెలిపారు.

బ‌ల‌హీన‌వ‌ర్గాల  ప్రజలంద‌రూ చైత‌న్య‌వంతులు కావాల‌ని,  త‌మ విలువైన ఓట్ల‌ను వేసి స‌రైన నాయ‌కుల‌ను ఎన్నుకోవాల‌ని పిలుపునిచ్చారు. తాను అనుకున్న గ‌మ్యాన్ని చేరేవ‌ర‌కు పోరు ఆగ‌ద‌న్నారు.  తెలంగాణ ఏర్ప‌డ్డ త‌ర్వాత‌ కూడా ఓపెన్ కాస్ట్ మైనింగ్ జ‌ర‌గ‌డం ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇటు ప్ర‌భుత్వం, అటు ప్ర‌తిప‌క్షాలు అధికారం ద‌క్కించుకోవ‌డానికి వ్యూహ‌ - ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నాయి. జనసేన లాంటి కొత్త పార్టీలు కూడా రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ - వైసీపీల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండ‌వ‌చ్చు. తెలంగాణలో కోదండ‌రాం వంటి మేధావులు - గద్దర్ వంటి ప్రజా గాయకులు - ప్ర‌భుత్వ వ్య‌తిరేకులు ఏక‌మైతే టీఆర్ ఎస్‌ కు జోరుకు బ్రేక్ ప‌డే అవ‌కాశ‌ముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News