క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన ప్రజాగాయకుడు గద్దర్ ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాయలసీమలో పర్యటన పెట్టుకున్నారు. కడపలో పర్యటించిన గద్దర్ స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీమ వాసుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. 1973 నుంచి కడపతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాయలసీమకు 70 ఏళ్ల పాలనలో ఒరిగింది ఏమీలేదనీ, మిగిలింది కన్నీళ్లేనని గద్దర్ అన్నారు. రాయలసీమ అంటేనే నీళ్లు లేక జనాల కళ్ల నుంచి రాలే కన్నీళ్ల గాథలే గుర్తుకొస్తాయని గద్దర్ తెలిపారు. రాయలసీమ ఎదుర్కొంటున్న వివిధ రకాల సామాజిక - ఆర్థిక - రాజకీయ సమస్యలపై పాటలను ఆలపించారు. తెలంగాణలో కనీసం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, రాయలసీమ, ఉత్తరాంధ్రలో చోటు చేసుకున్న నీటి ఎద్దడి కష్టాలు చెప్పలేని విధంగా ఉన్నాయన్నారు.
భారతదేశం సకల సంపదలకు నిలయంగా పేర్కొన్నా కనీసం పేదవాడికి తినడానికి తిండి లేని వైవిధ్యం కనిపిస్తుందని గద్దర్ అన్నారు. అందుకు దేశంలో పాలకుల పరిపాలనా విధానాలే కారణమని ఆరోపించారు. దేశంలో 97 శాతం మంది బహుజనులు ఉన్నా కేవలం మూడు శాతంగా ఉన్న పెత్తందారులు - పెట్టుబడిదారుల చేతుల్లోనే అధికారం ఉందన్నారు. ఇప్పటి వరకు ఆర్థికంగా, సామాజికంగా దోచుకున్న పాలకులు నేడు ఓటును కూడా దోచుకున్నారన్నారు. కులం పేరుతో సామాజిక దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. కుల వ్యవస్థను రూపుమాపడానికి దేశంలో రాజకీయ చైతన్యం అవసరమన్నారు. దేశంలో ఉత్పత్తిదారుడిగా ఉన్న రైతు నేడు ఎరువులు - విత్తనాలు మార్కెట్ లో కొనుగోలు చేస్తూ పూర్తి వినియోగదారుడిగా మారిపోయాడన్నారు. సబ్సిడీలను రైతుకు విదిల్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని గద్దర్ అన్నారు.
తమ రాష్ట్రం విడిపోతే బతుకులు మారుతాయని ఆశించామని, చివరికి రాష్ట్రం పేరు మారింది తప్ప ప్రజల బతుకుల్లో ఏమార్పు కనిపించలేదని గద్దర్ ఆరోపించారు. రాయలసీమలో విద్యా, ఉద్యోగాల కల్పన కరువైందని ఆక్షేపించారు. సీమ నుంచి అత్యధికంగా ముఖ్యమంత్రులుగా ఎన్నికైనా సీమకు ఒరిగింది శూన్యం అన్నారు. అభివృద్ధిలో భాగంగా హైవేలు వెలిసిన మాట వాస్తవమేనని, హైవేల కింద నలిగిపోయిన గ్రామాలెన్నో, చిధ్రమైన చేతివృత్తులెన్నో అని గద్దర్ విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/