ఏపీ టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు వరుస కడుతున్న సంగతి తెలిసిందే. అయితే... టీడీపీ మాత్రం వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పటికే ఎన్నికల సమయంలో రాయపాటి సాంబశివరావు - జేసీ బ్రదర్స్ వంటివారు టీడీపీలోకి వచ్చారు. ఆ తరువాత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా చంద్రబాబు పంచన చేరారు. కొద్ది నెలల కిందట నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి - ఆయన సోదరుడు వివేకా ఇద్దరూ టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు. అయితే.... మారో కాంగ్రెస్ సీనియర్ - మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో ఆయన చేరిక లేనట్లేనని అంతా భావించారు. కానీ, ఇంతలో గాదె స్వయంగా చేసిన ప్రకటన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.
చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమని గాదె ఈ రోజు ప్రకటించారు. బాపట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబు తనను పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలాంటి షరతులు పెట్టకుండా నేరుగా వెళ్లి ఆయన సమక్షంలో టీడీపీలో చేరిపోతానని చెప్పారు. అంతేకాదు.... టీడీపీలో చేరాలని బాగా ఉత్సాహంగా ఉన్న ఆయన పార్టీలోకి చేరకముందే చంద్రబాబుకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనడంతో తప్పేమీ లేదని... దీనిపై పేపర్లలో వార్తలు రాయించే బదులుగా ఆధారాలుంటే హైకోర్టులో కేసు వేసి సీబీఐ విచారణ కోరొచ్చు కదా అని వైసీపీకి ఓ సలహా పడేశారు. రాజధాని నిర్మిస్తున్న 29 గ్రామాలను విడిచిపెట్టి బయట గ్రామాల్లో భూములు కొంటే అందులో తప్పేముందో తనకు అర్థం కావడం లేదని గాదె అన్నారు. మరి... ఎలాంటి షరతులు లేకుండా వచ్చేస్తానని... చంద్రబాబు ఊ అంటే చాలంటున్న గాదెను చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.