ఆస్తుల కోసం రచ్చకెక్కిన గజపతిరాజులు!

Update: 2020-06-15 14:00 GMT
విజయనగరం పూసపాటి రాజుల కోటలో రచ్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఇన్నాళ్లు ఆ రాజులకు చెందిన మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును సాగనంపింది. ఇదే అప్పుడు వివాదమైంది.

టీడీపీలో అందరికంటే సీనియర్ నేత, వయసులో పెద్దాయన, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతికి ఈ షాక్ తో కోర్టుకు ఎక్కారు. తననే వారసుడిగా చేయాలని కోరారు. ఆ కేసు నడుస్తోంది.

అశోక్ గజపతి రాజు మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ పదవిని వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించింది. ట్రస్ట్ చైర్మన్ గా ఆయన కుటుంబానికే చెందిన వైసీపీ నేత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజును నియమించింది.

తాజాగా సింహాచలం ఆలయ చైర్మన్ గా సంచిత ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజే మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా సంచిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంచిత గజపతిరాజు నిర్వహించే మాన్సన్ ట్రస్ట్ కు 108 ఎకరాలు, 14800 ఎకరాల భూములున్నాయి. దేవాలయాల నిర్వహణ చూసే ఈ అతిపెద్ద ట్రస్ట్ అశోక్ గజపతి చేతుల మీద నుంచి మారిపోయింది.

ఇప్పుడు సంచితకు ఇవ్వడంపై మరొకరు పోటీ వచ్చారు. నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఆనందగజపతిరాజుకు తామే వారసులమని ఆయన రెండో భార్య సుధా గజపతిరాజు వారి అమ్మాయి ఉర్మిళా గజపతిరాజులు తెరముందుకు వచ్చారు.

ఈ ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు పెద్ద కుమార్తేనే సంచిత గజపతిరాజు. ఆమెను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ చైర్ పర్సన్ గా చేసింది.

ఈ నేపథ్యంలో ఆనంద గజపతిరాజు రెండో భార్య , కూతురు రంగప్రవేశం చేసి తమకూ ఆస్తుల్లో వాటా ఇవ్వాలని వారసులమని చెబుతున్నారు. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

ఇలా పూసపాటి రాజుల కోటలో ఇప్పుడు ఆనందగజపతి రాజుల ఇద్దరు భార్యలు, అశోక్ గజపతి రాజుతో కలిపి ముగ్గురు వేర్వేరుగా ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఆస్తి దక్కుతుందనేది కోర్టులే తేల్చాల్సి ఉంది.
Tags:    

Similar News