మైనింగ్ కింగ్ గాలి జనార్దన రెడ్డి గతంలో తాను చంద్రబాబు నాయుడిని తీవ్ర పదజాలంతో దూషించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో తన ఇంటిపై కొందరు యూత్ దాడి చేసినప్పుడు అప్పుడు ఆవేశంలో చంద్రబాబును దూషించానని.. కానీ, అలా అనకపోయి ఉండాల్సింది అని అనుకున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కొజ్జా అనడం అప్పట్లో తాను స్పీడుగా ఉన్న కాలంలో జరిగిందని... ఇప్పుడైతే అలా అనేవాడిని కానని ఆయన అభిప్రాయపడ్డారు.
టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ ప్రశ్నకు సమాధనం చెప్తున్న క్రమంలో అప్పటి వీడియో క్లిప్ కూడా చానల్ వారు ప్లే చేశారు. అయితే.. గాలి మళ్లీ దాన్ని వివాదం చేయడం ఇష్టం లేక వెంటనే అక్కడున్న టెక్నిషియన్లతో ‘‘చాలు బాబూ.. ఆపేయమ్మా’’ అంటూ దాన్ని ఆపివేయించారు.
తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని.. తాను ప్రజాధనం దోచుకోలేదని... వ్యాపారంలో లాభాలు రావడం వల్ల న్యాయబద్ధంగా తాను డబ్బు సంపాదించానే కానీ ఎవరికీ అన్యాయం చేయలేదని ఆయన అన్నారు. అలాగే తనకు లక్ష కోట్ల సంపద ఉందన్నది కూడా అవాస్తవమని అన్నారు. సీబీఐ లెక్కల ప్రకారం చూసుకున్నా తన ఆస్తి 2వేల కోట్లు మాత్రమేనని గాలి జనార్దన రెడ్డి చెప్పారు.
తనకు ఒకే ఒక కోరిక ఉందని... ఎన్టీఆర్ - జయలలిత - రాజశేఖరరెడ్డి - బాల్ ఠాక్రే వంటివారు చనిపోయినప్పుడు జనం వారి కోసం ఎంతగానో పరితపించడం చూశానని.. తన చివరి ఊపిరి తరువాత కూడా జనం తన కోసం అలా అనుకుంటే చాలని గాలి తత్వం మాట్లాడారు.
Full View