గాలి అరెస్ట్‌..మూడుగంట‌ల్లోనే కీల‌క స‌మాచారం

Update: 2018-11-11 17:21 GMT
బళ్లారి మైనింగ్ మాఫియా కింగ్ - కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారించడానికి పోలీసులు మూడు రోజులుగా ప్రయత్నించినా.. ఆయన ఆచూకీ తెలియలేదు. బెంగళూరు వదలి పారిపోయారని - హైదరాబాద్‌ లో తలదాచుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తానెక్కడికీ పారిపోలేదని - మూడు రోజులుగా బెంగళూరులోనే ఉన్నట్లు గాలి జనార్దన్ చెప్పారు. ఓ లంచం కేసులో మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన పోలీసులు.. తర్వాత అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్లపాటు జైల్లో గడిపిన గాలి.. ప్రస్తుతం బెయిల్‌ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో అధికారులు శనివారం రాత్రి గాలి జనార్దన్‌ రెడ్డిని మూడు గంటలకుపైగా ప్రశ్నించారు.

ఆంబిటెండ్ కంపెనీ కర్నాటకలో రూ.950 కోట్లకు పైగా జనాల నుంచి వసూలు చేసి - తిరిగి చెల్లించడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ ఏడాదిలోనే ఆంబిడెంట్ కంపెనీపై ఈడీ కేసు రిజిస్ట్రర్ చేసింది. తర్వాత ఇదే కేసులో ఆ కంపెనీ ఓనర్ ఫరీద్‌ ను అరెస్టు చేసింది. అతన్ని బయటపడేసేందుకు గాలి జనార్ధన్ రెడ్డి ఈడీలోని కొంతమంది అధికారులతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు బ్రిజేష్ అనే ఈడీ అధికారిని అదుపులోకి తీసుకుంది. గాలి జనార్ధన్ రెడ్డి కోసం వేట సాగించగా ఆయన నాలుగు రోజులపాటు కనిపించకుండా దోబూచులాడుతూనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే బెయిల్ దక్కక పోవడంతో జనార్ధన్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విక్టోరియా ఆస్పత్రిలో గాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News