కర్ణాటక రాజకీయం గురించి మాట్లాడే వారంతా తమ మాటల్లో గాలి ప్రస్తావన తీసుకురాకుండా మాటల్ని ముగించలేరు. ఆ మధ్యన సీబీఐ కేసులతో ఆయన ఇమేజ్ కాస్త మసకబారినప్పటికి.. ఆయన హడావుడి మాత్రం కించిత్ కూడా తగ్గలేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఆరేడేళ్ల క్రితం కర్ణాటక రాజకీయాల్ని సింగిల్ హ్యాండ్ తో శాసించిన ఆయన.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగలేకపోతున్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో బళ్లారి గడ్డ మీద కాలు మోపలేని పరిస్థితులు ఉన్నప్పటికీ.. గాలి మాత్రం కామ్ గా ఉండలేకపోతున్నారు. తాము మద్దతు పలికే బీజేపీ అభ్యర్థి శ్రీరాముల ఎన్నికల ప్రచారానికి అన్నీ తానై వ్యవహరిస్తున్న గాలి.. తాజాగా ఆయన ఏర్పాట్లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీరాముల్ని ఎన్నికల్లో గెలిపించేందుకు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బళ్లారి నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకున్న ఫాం హౌస్ లో ఏర్పాట్లకు కొదవ లేదని చెబుతున్నారు.
దాదాపు 16 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన డూఫ్లెక్స్ భవనం.. ఇంటి చుట్టూ మనసుకు హాయి కలిగించే పచ్చదనం.. పెద్ద ఎత్తున కొబ్బరిచెట్లు.. వేపతో పాటు పలు రకాల వృక్షాలతో నిండిన ఆ ప్రాంతానికి ఎన్నికల హడావుడిని గుర్తు చేస్తూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పార్టీ నేత బి. శ్రీరాముల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.
విలాసవంతమైన కార్లు... పెద్ద ఎత్తున అనుచరగణంతో చేస్తున్న గాలి హడావుడి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గాలి ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. ఈ ఫాం హౌస్ నుంచే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం ఫాంహౌస్‌కు వచ్చే పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా పెద్ద ఎత్తున టీ.. కాఫీలు.. అల్పాహారాలతో పాటు భోజన ఏర్పాట్లను సమకూర్చటానికి ఏకంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
ధాన్యం వ్యాపారి అయిన వెంకటేశ్ అనే వ్యక్తిది ఈ ఫాంహౌస్ అని.. ఆయన వద్ద గాలి అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు. బళ్లారి-చల్లకేరి రోడ్డులోని మొలకలమూరు రోడ్డు మీద ఉన్న ఈ భవనంలో పన్నుతున్న వ్యూహాలు గాలికి ఎంతమేరకు కలిసి వస్తాయో చూడాలి.