నాణెనికి ఒక పక్క మాత్రమే కనిపించేలా మాట్లాడటం రాజకీయ నాయకులకు అలవాటే. ఎప్పుడైతే తమను ఇరుకున పెట్టేందుకు వైరిపక్షం వారు ప్రయత్నిస్తారో.. ఆ సమయంలో డిఫెన్స్ లో పడిన నేతలు సైతం రంగంలోకి దిగుతారు. అలానే ఉంది ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితి. శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను భారీ ఎన్‌కౌంటర్ చేయటం.. 20 మంది వరకు మరణించటం తెలిసిందే.
దోపిడీ దొంగలు.. స్మగ్లర్లను అండగా ఏపీ విపక్ష నేతలు మాట్లాడేందుకు సైతం తెగించటంతో.. ఏపీ అధికారపక్ష నేతలు రంగంలోకి దిగారు. తాము కానీ మౌనంగా ఉంటే.. ప్రజలకు నెగిటివ్ సందేశం వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించిన వారు విపక్షంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. తమ సర్కారుపై చెలరేగిపోతున్న తమిళనాడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తాజాగా ఏపీ అధికారపక్షానికి చెందిన నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాటల దాడి మొదలెట్టారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు తమిళనాడు ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించారు. ఏపీలో ఉన్న ఎర్రచందనం దుంగలను కొట్టుకెళ్లి.. చెన్నై ద్వారా విదేశాలకు తరలిస్తున్నారన్నారు.పోలీసులను.. అటవీశాఖ అధికారుల్ని స్మగ్లర్లు కొట్టినప్పుడు కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలుఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ శేషాచలం ఎన్‌కౌంటర్ మీద వన్ సైడ్ వ్యాఖ్యల్ని మాత్రమే వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యలు చేయటంతో ఈ ఇష్యూ మరింత హాట్.. హాట్ గా మారింది.