తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహితుడు, రాజకీయాల్లో దాదాపుగా తనతో పాటు కెరీర్ ప్రారంభించిన దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబానికి తగు ప్రాధాన్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న ముద్దుకృష్ణమ కొద్దికాలం క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే కసరత్తును చంద్రబాబు పూర్తిచేశారని సమాచారం. ఆ టికెట్ ను గాలి ముద్దు కృష్ణమనాయుడు భార్య గాలి సరస్వతమ్మకు ఖరారు చేశారు.
చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. ఈ నేపథ్యంలో గాలి సరస్వతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులు శనివారం ఉదయం చంద్రబాబుని కలిశారు. గాలి ముద్దుకృష్ణమ మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గాలి తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సరస్వతమ్మకు టిక్కెట్ కేటాయింపుపై గాలి కుటుంబ సభ్యుల్లో కూడా ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం.