కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన లీడర్ గల్లా అరుణ కుమారి. ఒకప్పుడు ఆమె చెప్పిందే వేదంలా వ్యవహరించారు కార్యకర్తలు నాయకులు. వరుస విజయాలతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె కుంగుబాటుకు గురవ్వడానికి కారణం పక్కనున్న వారేనట. తనతో పాటు ఎప్పుడూ కారులో తిరుగుతున్న వారు కుట్రలు చేశారని వాపోతున్నారట..
రాయలసీమలో రాజకీయం అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి. ఇటువంటి చోట అరుణ కుమారి విజయవంతంగా తన పాత్రలను పోషించారు. తన కొడుకు కోసం ఎప్పుడూ టీడీపీ గడప తొక్కని ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో కండువా కప్పుకున్నారు. అయినా, ఆమె అక్కడ ఇమడ లేకపోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే.
తిరుపతి రూరల్ మండలంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె తన బాధనను వెళ్లగక్కారు. 2014 ఎన్నికల తరువాత ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
టీడీపీలో నిలదొక్కుకోవడానికి ఆమె మానసిక సంఘర్షణకు గురవుతూనే ఉన్నారట. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నట్లు వాపోయారు. ఇప్పటికే చంద్రబాబుతో ఈ విషయం చెప్పినా కింది స్థాయి నేతులు ఆమెను పట్టించుకోవడం లేదట. ఇదంతా కార్యకర్తల ముందు ఆమె తెలపడం టీడీపీలోకి వలస వచ్చిన వారి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఏమిటనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి.