ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు షాక్ తగలగా.. టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి ఊరట లభించింది. టీడీపీ ఎంపీ గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు గతంలో కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై హైకోర్టుకు గల్లా కుటుంబం ఎక్కింది. వాదనలు విన్న హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ప్రభుత్వం అమరరాజా ఇన్ ఫ్రాకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకునే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో స్టే రూపంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
2009లో అప్పటి రోశయ్య ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు 483.27 ఎకరాల భూమిని డిజిటల్ వరల్డ్ సిటీ నిర్మాణానికి కేటాయించారు. పదేళ్లు పూర్తయినా ఉద్యోగాలు కల్పించకపోవడంతో ఆ భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ పరిశ్రమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడంతో సంస్థ విస్తరణ కూడా చేపట్టలేదని ఈ భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.