దాదాపు పదిహేనేళ్ల తర్వాత జరుగుతున్న అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా టీడీపీ తరఫున మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసం వేళలో తన ప్రసంగంలో రెండుసార్లు సినిమా ముచ్చట్లను తీసుకొచ్చారు. సందర్భోచితంగా ఆయనీ ప్రస్తావన తేవటం అందరిని ఆకట్టుకునేలా చేసింది.
పార్లమెంటులో మోడీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం చర్చను ప్రారంభించిన ఎంపీ గల్లా జయదేవ్.. తన బావమరిది హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాను ప్రస్తావించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఎన్ ఆర్ ఐ కథే ఈ సినిమా చెప్పిన ఆయన.. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హీరో తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా సేవలు అందిస్తాడని చెప్పారు.
ఇచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలని.. అలా నిలుపుకోపోతే మనిషే కాదని ఆ సినిమాలోని డైలాగ్ ను ఇంగ్లిషులో అనువాదం చేశారు.ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. గంటకు పైగా సాగిన తన ప్రసంగంలో గల్లా ఏపీ రాజధాని అమరావతికి ఇచ్చిన నిధులు భారత్ లో భారీ హిట్ కొట్టిన బాహుబలి కలెక్షన్ల కంటే తక్కువగా వ్యాఖ్యానించారు. ఆ సినిమా రూ.1800 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని.. కానీ ఏపీ రాజధాని అమరావతికి మాత్రం కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని తప్పు పట్టారు.