గౌతమ్ గంభీర్ సంచలనాలకు కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మ్యాచ్ ఓడిపోయిన సందర్భంలో ఐపీఎల్ టైంలో తన తోటి ఆటగాళ్ల ప్రదర్శన తీరును గంభీర్ ఉతికి ఆరేస్తుంటాడు. మొహమాటం ఏమీ లేకుండా ఏకీ పారేస్తాడు. ఇప్పటికే పలు మార్లు సీనియర్ క్రికెటర్లు కోహ్లీ, ధోనికి కౌంటర్లు ఇచ్చాడు.తాజాగా మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ పై పడ్డాడు. అతడి ఆట తీరుపై తనదైన స్టయిల్ లో కౌంటర్లు ఇచ్చాడు.
‘ధోనీ గతంలో మాదిరిగా ఇప్పుడు మ్యాచ్ ఫినిషర్ కాదు. అతడు కాస్త ముందుగా వచ్చి పరుగులు తీయాలి. సీఎస్‌కే ప్లేయర్స్ లో ఆశలు రేకెత్తించాలి. అంతేగానీ ఏడో బ్యాట్స్‌మన్ గా, ఆరో బ్యాట్స్‌మన్ గా వస్తే లాభం ఏమిటి’ అంటూ కాస్త ఘాటుగా కౌంటర్లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్ గా మారాయి.
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన మహీ .. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. సీఎస్‌కే జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే గత రెండు సీజన్లుగా మహీ నుంచి ఆశించిన స్థాయిలో ఆటతీరు కనిపించడం లేదు. మరోవైపు ఆ జట్టులోని ఇతర ప్లేయర్స్ కూడా పెద్దగా రాణించడం లేదు. ఒకప్పుడు టాప్ జట్టుగా ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ ప్రస్తుతం ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్ తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.
నిన్న సీఎస్‌కే .. పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గంభీర్ సంచలన ట్వీట్ పెట్టాడు. గత సీజన్ లో 14 మ్యాచ్‌లాడిన ధోని 200 పరుగులు సాధించాడు. ఫలితం.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే జట్టు తొలిసారి ప్లేఆఫ్ కు అర్హత సాధించలేకపోయింది.
ప్రస్తుతం సీఎస్‌కే కష్టాల్లో కూరుకుపోయి ఉంది. బౌలర్లు, బ్యాట్స్మెన్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం లేదు. దీంతో ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. ఓ దశలో మహీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై ఇటు ధోనీ.. గానీ అటు జట్టు యాజమాన్యం గానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ సారైనా సీఎస్‌కే జట్టు ఏ మేరకే ఆడగలుగుతుందో వేచి చూడాలి.