ఇండియన్ మాజీ టాప్ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిదీల మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 2019 ఏప్రిల్ నెలలో విడుదలైన తన ఆత్మకథ 'ది గేమ్ ఛేంజర్' లో ఆఫ్రిది గంభీర్ గురించి ప్రస్తావించాడు. గంభీర్ తన కెరీర్‌లో ఎక్కువగా గొడవలే పడ్డాడని చెప్పాడు. అయితే కొన్ని కామెంట్స్ వ్యక్తిగతంగా ఉంటాయి. మరికొన్ని వృత్తిపరంగా ఉంటాయని అఫ్రిదీ పేర్కొన్నాడు. గంభీర్ కెరీర్లో పెద్దగా రికార్డులు లేకపోయినా ఆటిట్యూడ్ మాత్రం బాగా ఉందని ఆరోపణలు చేసాడు. ఆ ఆరోపణలకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ అప్పుడే ఇచ్చేసాడు.
ఇక తాజాగా అఫ్రిదిపై గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వార్తల్లో నిలిచాడు. ఇటీవల గంభీర్ పై అఫ్రిది మళ్లీ వివాస్పద వ్యాఖ్యలు చేసాడట. 'గంభీర్ ప్రవర్తన వ్యక్తిత్వం లేనిదని, ఐసీసీ టోర్నీలలో రికార్డులు లేవు కానీ ఆటిట్యూడే ఉంది' అని కామెంట్ చేసాడట. ఆఫ్రిది వ్యాఖ్యలపై ఆగ్రహించిన గంభీర్ తనదైన రీతిలో.. 'ఆఫ్రిది నీ వయసునే గుర్తుంచుకోలేని వ్యక్తివి.. ఇంకా నా రికార్డులెలా గుర్తుంటాయి నీకు..' అంటూ ట్వీట్ చేసాడు. అంతేగాక 'షాహిద్ అఫ్రిదీ నీకు ఓ విషయం గుర్తు చేస్తా అని.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో నేను 54 బంతుల్లో 75పరుగులు చేసాను.
గుర్తుందా ఆఫ్రిది.. నువ్వు మొదటి బంతికే డకౌట్ అయ్యావు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మేం కప్పు గెలిచాం. అబద్ధాలు, దేశద్రోహులు మరియు అవకాశవాదుల పట్ల నా ప్రవర్తన దురుసుగానే ఉంటుంది' అని గంభీర్ స్ట్రాంగ్ ట్వీట్ చేశాడు. అసలు వీరిద్దరి మధ్య యుద్ధం.. 2007 సంవత్సరం గువహటిలో జరిగిన వన్డేలో గంభీర్ అఫ్రిదిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ఆఫ్రిది తన ఆత్మకథలో గంభీర్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పడంతో మరింత ఎక్కువైంది.