గేమ్ ఛేంజర్ పేరుతో తన ఆత్మకథను రాసిన పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ పుస్తకంలో ప్రస్తుతం బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై విపరీత వ్యాఖ్యలు చేశారు. గంభీర్ వ్యక్తిత్వం లేనివాడని.. క్రికెటర్లలో అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్లు ఉండరన్నారు. కేవలం పొగరు తప్పించి.. ఎలాంటి రికార్డులు లేవన్న ఆఫ్రీది.. గంభీర్ లాంటోడ్ని కరాచీలో సర్యాల్ అని పిలుస్తామన్నారు.
ఇంతకీ సర్యాల్ అంటే మాడిపోతున్నోడని అర్థం. సంతోషంగా పాజిటివ్ గా ఉండేవారిని తాను ఇష్టపడతానని.. గంభీర్ లో అలాంటివేమీ కనిపించవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆటలో చెప్పుకోవటానికి ఏమీ లేకున్నా.. పొగరు మాత్రం దిట్టంగా ఉందన్నాడు. అతన్ని చూస్తే జాలి కలుగుతుందని.. అతనికి ఆటిట్యూడ్ లో ప్రాబ్లం ఉందన్న ఆఫీది.. కొన్ని గొడవలు వ్యక్తిగతంగా ఉంటాయని.. మరికొన్ని ఆట వరకే పరిమితమవుతాయన్నారు.
క్రికెట్ లో బ్రాడ్ మన్.. జేమ్స్ బాండ్ కలిస్తే తాను అన్నట్లుగా గంభీర్ ప్రవర్తిస్తాడని దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ సందర్భంగా తమ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గుర్తుందన్నారు. సింగిల్ పూర్తి చేసి తన మీదకు గంభీర్ దూసుకొచ్చాడని.. అంపైర్లు జోక్యం చేసుకోకుంటే.. తానే ముగించేవాడని వ్యాఖ్యానించారు.
ఆఫ్రీదీ వ్యాఖ్యలపై తాజాగా గంభీర్ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఘాటు వ్యాఖ్యల్ని తిప్పి కొడుతూ.. పంచ్ లు మీద పంచ్ లు ఇచ్చారు. ఆఫ్రీదీ.. నువ్వు భలే అల్లరోడివోయ్.. ఏమైతేనేం.. పాకిస్థానీయులకు మేమింకా మెడికల్ వీసాలు ఇస్తున్నాం.. నువ్వు కానీ వస్తే.. నేనే దగ్గరుండి నిన్ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళతా అంటూ ట్వీట్ చేశారు. ఆఫ్రీదీ చేసిన వ్యాఖ్యలకు లాగి ఒక్కటి ఇచ్చినట్లుగా గంభీర్ ట్వీట్ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.