మ‌హాత్ముడి మునిమ‌న‌వ‌రాలిపై మోసం కేసు!

Update: 2015-10-20 14:12 GMT
ఈ మాట విన్న వెంట‌నే మ‌న‌సును బాధ క‌మ్మేస్తుంది. ఆవేశం వ‌చ్చేస్తుంది. అయితే.. అదంతా కూడా జాతిపిత మ‌హాత్మ గాంధీ మీద ఉన్న అపార‌మైన ప్రేమ‌తోనే. ఆయ‌న మ‌హాత్ముడిలా ఉన్నారు కాబ‌ట్టి.. ఆయ‌న కుటుంబీకులంతా అలానే ఉండాల‌ని ఆశించ‌టం మామూలుగా జ‌రిగేదే. కానీ.. అందుకు భిన్నంగా మ‌హాత్ముడి మునిమ‌న‌మ‌రాలికి సంబంధించి ఇబ్బందిక‌ర‌మైన వార్త‌ను వినాల్సిన ప‌రిస్థితి.ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌ల్ని మోస‌గించార‌న్న ఆరోప‌ణ‌పై 45 ఏళ్ల అశిష్ ల‌తారాంగోబిన్ సోమ‌వారం ద‌క్షిణాఫ్రికా లోని డ‌ర్బ‌న్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజ‌ర‌య్యారు.

త‌న‌కో కాంట్రాక్ట్ ద‌క్కింద‌ని.. అందుకు కొంత డ‌బ్బు అవ‌స‌ర‌మైంద‌ని పేర్కొంటూ.. ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పేసి 8.30ల‌క్ష‌ల డాల‌ర్లు తీసుకొని మోస‌గించార‌ని ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని అశిష్ ల‌తా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమె 3,776డాల‌ర్ల పూచీక‌త్తు కోర్టుకు స‌మ‌ర్పించుకొని బెయిల్ పై విడుద‌ల‌య్యారు. జాతిపిత మ‌హాత్మ‌గాంధీ మునిమ‌న‌మ‌రాలిపై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌టం దుర‌దృష్ట‌క‌రమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిజం ఏమిటో.. కేసు కొలిక్కి వ‌చ్చాక కానీ తేల‌నుంది.
Tags:    

Similar News