మడిసన్నాక తప్పులు చేయటం కామనే. కానీ.. దానికి ఒక హద్దు.. పొద్దు ఉంటుంది. నిర్లక్ష్యానికి.. అలసత్వానికి పరాకాష్ట అన్న రీతిలో ఆర్ బీఐ అధికారుల తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. నోట్ల ముద్రణలో తప్పులు దొర్లటం అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే.. ఈ తప్పులు చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. వాటికి జరిగే రచ్చేచాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది.. తాజాగా ఆర్ బీఐ అధికారులు చేసిన తప్పు తెలిస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి.
జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ లేని రూ.2వేల నోట్లను ప్రింట్ చేయటమేకాదు.. వాటిని సకాలంలో గుర్తించి.. వినియోగంలోకి రాకుండా చేయాల్సింది పోయి.. అవి బ్యాంకుల్లోకి వచ్చేలా చేశారు. ఆర్ బీఐ తప్పు చేసిందే అనుకుంటే.. వారు చేసిన తప్పును సకాలంగా గుర్తించి.. అడ్డుకోవాల్సిన బ్యాంకింగ్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో.. గాంధీ బొమ్మ లేని రూ.2వేల నోటు మార్కెట్లోకి వచ్చాయి.
ఈ షాకింగ్ ఉదంతం మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలోని ఒక ఏజెన్సీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎస్ బీఐ బ్యాంకు వెళ్లి కొత్తరూ.2వేల నోట్లు తీసుకున్నారు. కొత్తవే కదా.. అందులోకి బ్యాంకులో తీసుకున్నవే కదా అని.. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన నోట్లను తీసుకొని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లాక కొత్త నోట్లను చూస్తే.. గాంధీ బొమ్మ ఉండాల్సిన ప్లేస్ ఖాళీగా ఉండటంతో.. తమకిచ్చినవి దొంగ నోట్లుగా భావించినా రైతులు బ్యాంకుకు ఉరుకులు పరుగుల మీద వెళ్లారు.
అవి దొంగనోట్లు కావని.. ఆర్ బీఐ నోట్లేనని చెప్పిన బ్యాంకు సిబ్బంది.. ఆ నోట్లను వెనక్కి తీసుకొని.. కొత్త నోట్లను తిరిగి ఇచ్చారు. ప్రింటింగ్ లోపం కారణంగా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది చెప్పారు. ఎంత ప్రింటింగ్ లోపమైతే మాత్రం.. మరీ ఇంత నిర్లక్ష్యమా అని అవాక్కు అవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/