గమనించారా? : గాంధీ చూపునే మార్చేశారే

Update: 2016-11-27 08:25 GMT
ఇప్పుడు అందరి చేతుల్లోనూ కొత్తగా వచ్చిన రూ.2వేల నోటు కనిపిస్తోంది. రూ.2వేల నోటు ఎలా ఉండాలో అస్సలు అలా ఉండట్లేదన్న మాట చాలామంది నోటు నుంచి వినిపిస్తోంది. అన్నింటికి మించిన మనకు బాగా అలవాటైన నోట్లకు భిన్నంగా ఈ కొత్త నోటు ఉండటం ఒక కారణమైతే.. ఈ కొత్త నోటుతోమన అలవాట్లను చాలానే మార్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో నోటు మీద ఏదో ఒకటి రాయటం.. ఎన్నినోట్లు అన్న లెక్కకోసం పెన్నుతో..పెన్సిల్ తో రాసే అవకాశం కొత్త నోటుకు లేకపోవటం చాలామందిని నిరాశకుగురి చేస్తోంది.

ఇక.. కొత్త నోటు రంగు మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. మరొకొందరు నోటు సైజు ఏ మాత్రం బాగోలేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకూ కరెన్సీనోట్ల మీద గాంధీ చూపును మార్చేసిన తీరు కొందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో నోట్ల మీద జాతిపిత దృష్టి ఎడమచేతి వైపు ఉంటుంది. కానీ.. తాజాగా మోడీ సర్కారు విడుదల చేసిన రూ.2వేల నోటులోనూ.. రూ.500 నోటులోనూ కుడివైపు చూస్తున్న వైనం కనిపిస్తుంది. నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ.. ఏన్నో దశాబ్దాలుగా నోటు మీదున్న ‘గాంధీ’ చూపును మార్చేసిన ఘనత మాత్రం మోడీ సర్కారుకే చెల్లుతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News