గత కొన్ని రోజులుగా అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. మినియాపొలిస్ నగరంలో మే 25న పోలీస్ కస్టడీ లో జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిరసనకారులు ఆ దేశంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని నల్లజాతీయులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు.
కాగా, నిరసనకారులు వెనక్కితగ్గకుంటే శాంతిభద్రతలు కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించగా.. సుమారు 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి.