గ్యాంగ్ రేప్ చేస్తూ..ఎఫ్ బీలో లైవ్ స్టీమింగ్ పెట్టారు

Update: 2017-01-24 10:37 GMT
వీళ్లను ఏమనాలి? ఆరాచకానికి పరాకాష్ఠ అన్నట్లుగా ఉంది వీరి ఉన్మాదం. మనుషుల రూపంలో ఉన్న పిశాచాల మాదిరి వ్యవహరించిన వీరి రోత వ్యవహారాన్ని ప్రపంచం మొత్తం అసహ్యించుకుంటోంది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా మరీ ఇంత వికృత పోకడా? అని షాక్ తింటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా చెప్పుకునే స్వీడన్ లాంటి దేశంలో చోటు చేసుకున్న ఈ ఘోరం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోంది.

స్వీడన్ రాజధాని స్టాక్ హోంకు చెందిన ముగ్గురు యువకులు ఒక యువతిపై రేప్ చేశారు. వారీ దారుణానికి పాల్పడటమే కాదు.. తాము చేస్తున్న దుర్మార్గాన్ని తమకు చెందిన ఒక ఎఫ్ బీ గ్రూప్ లో లైవ్ స్ట్రీమింగ్ కి పెట్టేశారు. ఈ గ్రూప్ లో దాదాపు  60వేల మంది ఉండటం గమనార్హం. ఈ గ్రూపులో ఉన్న ఒక మహిళ.. జరుగుతున్న దారుణాన్ని చూసి తట్టుకోలేక వెంటనే.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పిశాచాల్లా వ్యవహరించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్టాక్ హోంకు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోని ఒక అపార్ట్ మెంట్ లో వీరీ దారుణానికి పాల్పడ్డారు. తాము చేసిన దారుణాన్నివీడియో తీసి.. ఫోటోలు తీసి స్నాప్ చాట్ కూడా పెట్టినట్లుగా చెబుతున్నారు. వీడియో ఫుటేజ్ లో ఒక యువకుడి దగ్గర రివాల్వర్ ఉందన్న విషయాన్ని గుర్తించారు. మరింత దుర్మార్గమైన విషయం ఏమిటంటే.. ఈ వీడియోను ఫేస్ బుక్ గ్రూపులోని పలువురు మౌనంగా వీక్షించారే కానీ స్పందించలేదు. నలుగురికి మేలు చేసే అంశాలకు వినియోగించాల్సిన లైవ్ స్ట్రీమింగ్ అప్షన్ ను మరీ ఇంత దారుణానికి వినియోగిస్తారా? అన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News