విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతం నిజంగా నిజం. కర్నూలు జిల్లాలోని ఒక మూలకు ఉండే ఆలూరు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అక్కడి జూనియర్ కాలేజీలో విద్యార్థుల మధ్య నెలకొన్ని చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. విద్యార్థుల్లో కొందరు రెండు గ్రూపులుగా మారి.. గ్యాంగ్ వార్ ను తలపించేలా జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మూడు రోజుల క్రితం చిన్న విషయం మీద కాలేజీలో వివాదం చోటు చేసుకుంది. అండర్ కరెంట్ గా రగులుతున్న ఈ ఉదంతం మూడో రోజుకు బాహాటంగా తిట్టుకోవటం.. కొట్టుకోవటం వరకు వెళ్లిపోయింది. విద్యార్థుల్లో కొందరు రెండు గ్రూపులుగా మారిపోయారు. కాలేజీ గ్రౌండ్ లో దాదాపు అరగంట పాటు వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వారి అరుపులు.. కేకలకు మిగిలిన విద్యార్థులు భయంతో పారిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటంతోపాటు.. గాయపర్చుకోవటానికి ఏ మాత్రం వెనుకాడలేదు.
వీరి పోరును షాక్ తిన్న కాలేజీ యాజమాన్యం వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎంట్రీ ఇచ్చిన కాసేపటికి కానీ పరిస్థితి చక్కబడలేదు. బుద్ధిగా చదువుకోవాల్సిన వేళ.. ఈ గ్యాంగ్ వార్ లు ఏమిటి? ఇలా కాలేజీగ్రౌండ్ లో కొట్టుకోవటం ఏమిటన్నది చర్చగా మారింది. ఈ ఇష్యూపై కాలేజీ యాజమాన్యంతో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్యూను శాంతియుతంగా సెటిల్ చేయాలని.. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలే కానీ.. కేసుల ఉచ్చులో పడేసి వారి బంగారు భవిష్యత్తును దెబ్బ తీయొద్దని కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.