ర‌జినీతో బీజేపీ అభ్య‌ర్థి...అమ్మ‌సీటుపై హాట్ చ‌ర్చ‌

Update: 2017-03-21 14:27 GMT
తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్ త‌న రాజ‌కీయ అరంగేట్రానికి సంబంధించి కీల‌క అడుగు వేస్తున్నారా? ఈ క్ర‌మంలో ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వ‌హించిన‌ ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్య‌ర్థి గంగై అమరన్ సూప‌ర్ స్టార్‌ ను  త‌న నివాసంలో క‌లుసుకోవ‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది.

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ను ఆయన నివాసంలో ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ కలుసుకున్నారు. గంగై అమరన్‌ కు రజనీ సాదర స్వాగతం కలిసి అనంతరం ఆయ‌న‌తో ఆత్మీయంగా సంభాషించారు. అంత‌కాదు కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా రజనీ ఆశీస్సులను గంగై అమరన్ కోరినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికలో భాగంగా ఆర్కే న‌గ‌ర్‌లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా ముంద‌కు సాగుతున్న క్ర‌మంలో ర‌జినీ బీజేపీ అభ్య‌ర్థిని క‌ల‌వ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది. కాగా, గంగై అమరన్ 2014 డిసెంబర్‌ 20న చెన్నైలో జరిగిన ఓ బహిరంగ సభలో అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 69 ఏళ్ల గంగై అమరన్ ప్రముఖ సంగీత దర్శకుడు.ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు. అన్న‌లాగే సంగీతానికే ప‌రిమితం కాకుండా  గేయ రచయిత, గాయకుడు, దర్శకుడుగా కూడా అమ‌ర‌న్ పేరు తెచ్చుకున్నారు. దాదాపు 50కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. ఇలాంటి నేప‌థ్యం ఉన్న గంగై తాజాగా ర‌జినీకాంత్‌ ను క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News