విశాఖపట్నంలో అత్యంత కీలకమైన గంగవరం పోర్టు సంపూర్ణంగా అదానీ గ్రూప్‌కు సొంతమైంది. లాభాలు సాధించి పెడుతున్నప్పటికీ... అవసరం లేకున్నప్పటికీ గంగవరం పోర్టులో తనకున్న వాటాను రాష్ట్ర ప్రభుత్వం 'అదానీ'కి అమ్మేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో దీనిని విక్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. గంగవరం పోర్టులోని ప్రైవేటు వాటాలను అదానీ సంస్థ ఇదివరకే కొనుగోలు చేసింది. ఇందులో ఏపీ సర్కారుకు 10.4 శాతం వాటా ఉంది. దానిని అదానీ గ్రూప్‌కు రూ.644.78 కోట్లకు విక్రయించేసింది.
ఈ 'డీల్' విజయవంతంగా పూర్తయినట్లు అదానీ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు లేఖ రాసింది. ఏపీ సర్కారు నుంచి గంగవరం పోర్టు వాటాలను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు ఆమోదిస్తూ ఈనెల 23న అదానీ సంస్థకు లేఖ రాసింది. ఈ లేఖ మంగళవారం తమకు అందిందంటూ... అదేరోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు (బీఎస్ఈ, ఎన్ ఎస్ ఈ) అదానీ సంస్థ సమాచారం అందించింది. ఈ మొత్తం లావాదేవీ నెలలో పూర్తవుతుందని తెలిపింది. గంగవరం పోర్టు తొలుత ప్రభుత్వ పోర్టుగా తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. రక్షణశాఖతోపాటు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు చకచకా వచ్చాయి.
పోర్టుకు అవసరమైన 1800 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. ఆ తర్వాత... అనూహ్యంగా ఇది ప్రైవేటు పోర్టుగా మారింది. ఇందులో 58.1 శాతం వాటా డీవీఎస్ రాజు కుటుంబానికి, దుబాయ్‌కి చెందిన విండీలేక్‌సైడ్ అనే కంపెనీకి 31.5ు వాటాలు ఉన్నాయి. భూములు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం 10.4% వాటా తీసుకుంది. మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం రూపంలో ఈ పోర్టుకు కచ్చితమైన వ్యాపారం దక్కుతోంది. సుమారు రూ.500 కోట్ల నగదు నిల్వలతో నడుస్తున్న పోర్టు ఇది. ప్రతి ఏటా లాభాల పంట పండిస్తోంది. అలాంటి పోర్టును డీవీఎస్ రాజు కుటుంబం వదులుకోవడం పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టించింది.
డీవీఎస్ రాజు, విండీలేక్‌సైడ్ వాటాలను.. అదానీ సంస్థ ఒక్కో షేరుకు రూ.120 చొప్పున వెల కట్టి కొనుగోలు చేసింది. గంగవరం పోర్టుకున్న వాస్తవ విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర అనే అభిప్రాయాలు వెలువడ్డాయి. చివరికి... రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే విలువతో తన వాటాను అదానీకి విక్రయించింది. అమ్మాల్సిన అవసరం లేకున్నా అమ్మేయడం ఒక తప్పిదమైతే... కారుచౌకగా కట్టబెట్టడం మరో ఘోరమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో బిడ్డింగ్‌కు పిలిచి ఉంటే... రాష్ట్ర ప్రభుత్వ వాటాకు కచ్చితంగా ఇంతకు రెట్టింపు ధర పలికేదని చెబుతున్నారు.