గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ తర్వాత అతనికి సంబంధించి బయటకు వస్తున్న విషయాలు ఒక్కొక్కటి ఒక్కోసంచలనంగా మారుతున్న పరిస్థితి. కరుడుగట్టిన నేరస్తుడిగా నయింకు పేరుప్రఖ్యాతులున్నా.. అతడి నేర చరిత్ర మరీ ఇంత తీవ్రంగా ఉంటుందన్న అంచనా ఎవరికీ లేదన్న వ్యాఖ్య వినిపిస్తోంది. అతని ఎన్ కౌంటర్ తర్వాత.. అతను కూడబెట్టిన ఆస్తుల చిట్టా చూస్తున్న వారికి మెంటల్ ఎక్కిపోతున్న పరిస్థితి. వేలాది కోట్ల రూపాయిలు వెనకేసుకున్న వైనంతో నోట మాట రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. గ్యాంగ్ స్టర్ గా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న అతగాడి ఎన్ కౌంటర్ కానీ జరిగి ఉండకపోతే అసలేం జరిగేదన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర సమాచారం బయటకు వస్తోంది. నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే కావాలన్నదే అతడి ఆశయంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద పదే పదే చెప్పుకోవటంతో పాటు.. త్వరలో తాను ఎమ్మెల్యే అవుతానని వ్యాఖ్యానించటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకాలం గ్యాంగ్ స్టర్ గా తనకున్న చెడ్డపేరును తొలగించుకునేందుకు.. ప్రజాప్రతినిధిగా రూపాంతం చెందేందుకు వీలుగా అతగాడు భారీ స్కెచ్ వేసినట్లుగా చెబుతున్నారు. ఓటర్ల మనసుల్ని గెలుచుకునేందుకు వీలుగా నల్గొండలో వినాయకచవితి.. ఉర్సు ఉత్సావాలను పెద్ద ఎత్తున నిర్వహించటంతో పాటు.. కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల పేరిట భారీగా డబ్బు ఖర్చు చేసి.. కొన్ని వర్గాలకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు.
దీనికి తోడు.. తనను హీరోగా ప్రొజెక్టు చేసుకునేందుకు వీలుగా ఒక టీవీ ఛానల్ ను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో నయిం ఉన్నారని.. ఇందుకోసం ఒక వ్యక్తికి భారీగా డబ్బును ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ టీవీ ఛానల్కు సంబంధించిన లోగోను కూడా సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ నయిం కానీ ఎన్ కౌంటర్ కాకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉండేవేమో..?