ఎన్నికల ప్రచారంలో కొన్ని పార్టీల నేతలు అనుసరిస్తున్న తీరు అభ్యంతరనీయంగా ఉండటమే కాదు.. ఓటర్లు బిచ్చగాళ్లు అనుకుంటున్నారా? అన్న భావన కలుగజేసేలా ఉంది. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్ పార్టీ నేత ఒకరు.. జనం మీదకు నోట్లను వెదజల్లటం ముక్కున వేలేసుకునేలా మారింది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంగుల బ్రిజేంద్రరెడ్డి బరిలోకి దిగారు. ఆయన తరఫున ప్రచారం చేయటానికి కొందరు వైసీపీ నేతలు రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా వైసీపీ కి చెందిన నేతలు.. అక్కడకు చేరుకున్న జనం మీదకు కరెన్సీ నోట్లను విసిరారు.
ఒక్కసారిగా కరెన్సీ నోట్లను విసరటంతో అక్కడి వారంతా వాటిని ఏరుకునేందుకు ఉత్సాహం చూపించటంతో.. అదే పనిగా సదరు ఛోటా నేత నోట్లను విసిరారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా ఉన్న ఈ ఘటనపై టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయాలని కోరారు.
ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలతో పార్టీ పరువు పోతుందన్న విషయాన్ని జగన్ టీం గుర్తిస్తే మంచిది. ప్రజలకు మంచి చేయాలనుకోవటం తప్పు కాదు.. కానీ.. వారిని బిచ్చగాళ్లుగా మారుస్తూ.. నోట్లు విసిరే చర్యలకు బ్రేకులు వేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.