కోహ్లికి షోకాజ్ నోటీసుకు గంగూలీ రెడీ.. కానీ అంతలోనే..

Update: 2022-01-21 06:54 GMT
క్రికెట్లోని అన్ని పార్మాట్లకు కెప్టెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల విరాట్ కోహ్లి ప్రకటించారు. అశేష క్రీడాభిమానులను సంపాదించుకున్న కోహ్లి సంచలన ప్రకటన చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  బీసీసీఐ కి కోహ్లికి పడకపోవడంతో ఆయన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కోహ్లికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధం కావడంతో బీసీసీఐ, కోహ్లీ మధ్య పొరపొచ్చాలు ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇటీవల కోహ్లీ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ కార్యదర్శి జై షా కు తెలిపాడట. దీంతో ఆయన విషయం దుమారం కాకుండా గంగూలిని ఒప్పించినట్లు కథనాలు వస్తున్నాయి.

గతేడాది దుబాయ్ వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రపంచ కప్ లో దారుణంగా విఫలం చెందడంతో వెంటనే తాను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. టెస్ట్, వన్డే ఫార్మట్లలో కొనసాగుతానని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను అలా ప్రకటించడంపై బీసీసీఐ ఆరా తీసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల మధ్య కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. వన్డేలకు, టీ 20లకు ఇద్దరు కెప్టెన్లు ఉండడం సరికాదనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

అయితే ఈ సమయంలో మీడియాకు కోహ్లి విషయంలో కొన్ని లీకులు వెళ్లాయి. దీంతో కోహ్లీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో అప్పటి వరకు టెస్ట్ కెప్టెన్సీగా మాత్రమే ఉన్న కోహ్లి ఆయన సారథ్యంలో దక్షిణాఫ్రికా టూర్ కు సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆ సమయంలో కోహ్లి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంటన్నర ముందు మాత్రమే తెలిపారని అన్నారు. అలాగే టీ 20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తరువాత ఎవరూ తనకు అడ్డుచెప్పలేదన్నారు. అయితే గంగూలీ చెప్పాడని చెప్పిన విషయం అబద్దమని కోహ్లి అన్నాడు.

అప్పట్లో కోహ్లి ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ఆ తరువాత సౌతాఫ్రికా టూర్ కు వెళ్లిన కోహ్లి సేన తొలి రెండు మ్యాచులను గెలించింది. అయితే మూడో మ్యాచ్లో అజింక్య రహనెకు బదులుగా శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవాలసి కోహ్లి సూచించారు. కోచ్ ద్రవిడ్ మాత్రం రహెనె వైపే మొగ్గు చూపారు. అంతేకాకుండా  ద్రవిడ్ కు బీసీసీఐ మద్దతు తెలపడంతో కోహ్లి మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో జట్టు ఎంపికలో తన ప్రమేయం తగ్గిందని కోహ్లి మనస్థానికి గురైనట్లు సమాచారం. దీంతో ఈ సిరీస్ తరువాత కోహ్లి టెస్ట్ ఫార్మట్ కు కూడా వీడ్కోలు పలికారు.

ఈ పరిస్థితుల్లో బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీ తమ నిర్ణయాలకు కోహ్లి వ్యతిరేకంగా ఉంటున్నారని, అలాగే మీడియా సమావేశంలో గంగూలీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కోహ్లికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని  బీసీసీఐ ప్రధాన కార్యదర్శికి సూచించాడు. అయితే ఆయన కోహ్లికి ఉన్న క్రీడాదరణలో భాగంగా షోకాజ్ నోటీసు ఇస్తే వివాదం పెద్దదవుతుందని తెలిపినట్లు సమాచారం. దీంతో గంగూలికి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News