భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం జులై 13న లార్డ్ స్టేడియంలోని బాల్కనీలో తన షర్ట్ జెర్సీని విప్పి గిరిగిరా గాల్లోకి తిప్పాడు. ఆ ఘటన జరిగి 20 ఏళ్లు అవుతోంది.ఆ విజయానికి గుర్తుగా తాజాగా గంగూలీకి అరుదైన సన్మానం జరిగింది.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 20 ఏళ్ల క్రితం గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఇదే ఇంగ్లండ్ గడ్డపై ఆ టీంను ఓడించి నాట్ వెస్ట్ ఫైనల్ లో విజయం సాధించింది. లార్డ్స్ లో విజయం సాధించింది.
2002 జులై 13న ఇంగ్లండ్ తో లార్డ్ స్టేడియంలో నాట్ వెస్ట్ ఫైనల్లో 326 పరుగుల లక్ష్యాన్ని అద్భుత రీతిలో భారత్ జట్టు ఛేదించి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఊగిపోయిన అప్పటి కెప్టెన్ గంగూలీ తన జెర్సీని తీసేసి గాల్లోకి తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బ్రిటన్ పార్లమెంట్ సౌరవ్ గంగూలీని సత్కరించింది. ఈ విషయాన్ని దాదా స్వయంగా వెల్లడించాడు.బ్రిటన్ పార్లమెంట్ తనను సత్కరించిందని.. ఆరు నెలలక్రితం తనను సంప్రదించారని.. ఏటా ఈ సత్కార కార్యక్రమం బ్రిటన్ చేస్తుంటుందని.. ఈ ఏడాది తనకు ఆ అవకాశం దక్కిందని వివరించాడు.
20 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ను భారత్ జట్టు ఓడించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇప్పుడున్న టీం కూడా ఇంగ్లండ్ ను గత వారం టీ20 సిరీస్ లో ఓడించిందని సౌరవ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. టెస్ట్ సిరీస్ ను 2-2తో డ్రాగా ముగించింది. ఆ తర్వాత టీ సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది. మూడు వన్డేలసిరీస్ ను 1-0తో ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ లో రెండో వన్డేను ఈరోజు ఆడుతోంది.