తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు అనుచరులు తమ నాయకుడికి బెర్తు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరైతే ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు ఇంటివద్దే నిరసన తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలు సైతం తెలుగుదేశం నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో చివరి వరకు రేసులో ఉండి తుది నిమిషంలో అవకాశం కోల్పోయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవుల కోసం ఎవరి కాళ్లూ పట్టుకోనని వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల సందర్భంగా అధిష్టానం ఇచ్చిన హామీ మేరకే తాను ఎమ్మెల్సీ టిక్కెట్ ను కోరానని గన్ని కృష్ణ స్పష్టం చేశారు. కానీ తనకు నిరాశే మిగిలిందని చెప్పారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చిక్కాలకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చారన్నారు. కులం పేరుతో పదవిని అడిగే దిగజారుడుతనం తనకు లేదన్నారు. పదవులు రాలేదని తాను బాధపడనని, వాటి కోసం ఎవరి కాళ్లు పట్టుకోనని వ్యాఖ్యానించారు. ఓపిక ఉన్నంత వరకూ పార్టీకి కట్టుబడి పనిచేస్తానని, లేకుంటే ఇంటి వద్దే కూర్చుంటాను తప్ప వేరే పార్టీ కండువాను వేసుకోనని గన్ని కృష్ణ తెలిపారు.తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై తన కేడర్ లో కొంత అసంతృప్తి ఉందన్నారు.
ఇదిలాఉండగా చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దొరబాబును ఎంపిక చేయడంపై సైతం కొందరు తెలుగుదేశం తమ్ముళ్లే విమర్శలు చేస్తున్నారు. దొరబాబుతో పాటుగా పోటీ చేయాలనుకున్న వారిని బలవంతంగా తప్పించారని అంటున్నారు. అనేక ఉత్కంఠ పరిస్థితుల మధ్య చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన తీరును ఈ సందర్భంగా గుర్తుచేశారు. చిత్తూరు ఎమ్మెల్సీ స్థానం కోసం దొరబాబుతో పాటు ఐదుగురు పోటీ పడ్డారు. వీటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గిరీషా బుధవారం పరిశీలించారు. ఇందులో కెవిపల్లి మండలం నూతన కాలువ ఎంపిటిసి వెంకటరమణారెడ్డి నామినేషన్ రిజెక్ట్ అయింది. అభ్యర్థికి పది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంది. వీరు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉండాలి. అయితే సాధారణ ఓటర్ల ద్వారా ప్రతిపాదించడంతో ఆయన నామినేషన్ తిరస్క రణకు గురయ్యింది. ఇక వెదురుకుప్పం జెడ్‌పి టిసి మాధవరావు నామినేషన్ పత్రాలతో పాటు స్టాంప్ పేపర్ ను జతచేయాల్సి ఉంది. అయితే ఇది చేయకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పరిశీలన పూర్తయిన వెంటనే మరో అభ్యర్థి చంద్రమౌళి తన పోటీని ఉపసంహరించుకున్నారు. మధ్యాహ్నం తరువాత మస్తాన్ రెడ్డి కూడా నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇలా వెనక్కి తగ్గడం పార్టీ పెద్దల ఆదేశాల మేరకేనని అంటున్నారు. ఇలా పోటీలో ఉన్న నలుగురిలో ఇద్దరివి తిరస్కరణకు గురికావడం, మరో ఇద్దరు ఉప సంహరించుకోవడం వల్ల పోటీలో దొరబాబు రాజసింహులు మాత్రమే మిగిలారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/