జగన్ చేతికి చిక్కిన ఆ ఇద్దరు మంత్రులు

Update: 2017-03-28 10:44 GMT
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ మంత్రులు ఏం చెబుతున్నారో వారికే అర్థం కావడం లేదు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు... ఆయన వియ్యంకుడు, నారాయణ విద్యాసంస్థల అధిపతి, మంత్రి అయిన నారాయణలు ఈ విషయంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు.  అసలు పేపర్ లీకేజీ అన్నదే లేదని నారాయణ చెప్పగా, నెల్లూరులో పేపర్ లీకేజీ వాస్తవమేనని విద్యా శాఖ మంత్రి గంటా చెప్పారు. దీంతో ఏది నిజమన్న ప్రశ్న వినిపిస్తోంది.
    
నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని గంటా అంగీకరించారు. విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా చెప్పారు. కానీ  నారాయణ మాత్రం మరో రకంగా స్పందించారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని అన్నారు.
    
కాగా ఈ ఇద్దరి ప్రకటనలు ఇలా ఉండగా.. పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూలులోనే పేపర్ లీకేజీ జరిగినట్లు తేలిందని వైసీపీ నేతలు అంటున్నారు. 4238  నంబర్ సెంటర్ నుంచి లీకయిందని జగన్ అసెంబ్లీ సాక్షిగా పక్కా ఆధారాలతో చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక విపక్ష అధినేత చేతికి చిక్కడంతో ఇద్దరు మంత్రుల్లో కంగారు మొదలైందని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News