సీట్ల లెక్క‌పై ప‌వ‌న్‌కు గంటా కౌంట‌ర్

Update: 2017-10-03 10:05 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కౌంట‌ర్ ఇచ్చారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. జ‌న‌సేన ట్విట్ట‌ర్ ఖాతాలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలోని 175 స్థానాల నుంచి పార్టీ పోటీ చేస్తుందంటూ ఒక ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త అకౌంట్ నుంచి కాక జ‌న‌సేన పార్టీ అకౌంట్ నుంచి ట్వీట్ గా వ‌చ్చింది. దీంతో..  రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేగింది. ఏపీ మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్‌.. ఉన్న‌ట్లుండి 175 స్థానాల ఉంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న రాగా.. ఆ ట్వీట్‌పై స్పందించారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ఎన్నిక‌లకు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని.. ఎన్నిక‌ల్లో ఏ పార్టీ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తుందో ఎన్నిసీట్ల‌కు పోటీ చేస్తుందో ఎవ‌రికి తెలీద‌ని వ్యాఖ్యానించారు. 175 సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌న్న మాట‌కు ఈ రీతిలో గంటా కౌంట‌ర్ ఇచ్చారు.

అయితే.. ఈ ట్వీట్ పొర‌పాటున పోస్ట్ చేశార‌ని.. జ‌న‌సేన కార్యాల‌యంలో ఐటీ విభాగంలో ప‌ని చేసే వ్య‌క్తి త‌ప్పు కార‌ణంగా ఈ ట్వీట్ వ‌చ్చింద‌ని పార్టీ వెల్ల‌డించింది. ఆ మ‌ధ్య‌న ప‌వ‌న్ తో భేటీ సంద‌ర్భంగా ఎన్నిక‌ల్లో పార్టీ ఎంత‌మేర పోటీ చేయాల‌న్న దానిపై ప్ర‌శ్న‌కు.. త‌గిన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప‌వ‌న్ చెప్పార‌ని.. కానీ.. అర్థం చేసుకోవ‌టంలో జ‌రిగిన పొర‌పాటు కార‌ణంగా ఈ ట్వీట్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. ట్వీట్ పోస్ట్ చేసిన కాసేప‌టికే ఈ ట్వీట్‌ను జ‌న‌సేన తొల‌గించేసింది.
Tags:    

Similar News