వైసీపీలోకి గంటా...ముహూర్తం ఫిక్స్...?

Update: 2022-11-26 08:47 GMT
మొత్తానికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయ అడుగులు ఎటువైపో స్పష్టం అవుతోంది. ఆయన టీడీపీ రాజకీయాలకు అతి త్వరలోనే స్వస్తివాచకం పలకనున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చెసుకున్నట్లుగా  చెబుతున్నారు.

తాజాగా గంటా తన బంధువులు సన్నిహితులతో ఇదే విషయం మీద ఇప్పటికే మాటలు మంతనాలు పూర్తి చేశారని అంటున్నారు. వైసీపీలోకి మారే విషయంలో గంటా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. వైసీపీ పెద్దలకు కూడా గంటా తమ పార్టీలో చేరడం ఇష్టమని అంటున్నారు. ఆయనకు ఇపుడు వైసీపీలో చేరడానికి ఎలాంటి అడ్డంకులు లేవు.

ఒకనాడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు ఆయన రాకను వ్యతిరేకించారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గంటాను వద్దు అనుకున్నారు. ఇపుడు ఈ ఇద్దరూ విశాఖ వైసీపీలో కీలకంగా లేరు. పైగా గంటాకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ అయ్యారు.

దాంతో గంటా వైసీపీలోకి చేరి చక్రం తిప్పడానికి అంతా సిద్ధం చేసుకున్న్నారు అని అంటున్నారు. ఆ మధ్య గంటా జనసేనలో చేరుతారు అని కూడా ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ వెళ్లి మరీ మెగాస్టార్ చిరంజీవిని కలసి వచ్చారు కూడా. అయితే ఎందుకో జనసేన వైపు గంట అమొగ్గు చూపడడం లేదని అంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీయే మరోమారు అధికారంలోకి వస్తుంది అని గంటా శ్రీనివాసరావు అంచనా వేస్తున్నారు అని అంటున్నారు.

అదే విధంగా తెలుగుదేశం విపక్షంగా అనుకున్నంతగా రాణించలేకపోవడంతోనే ఆయన ఆ పార్టీని వీడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా వేరే కారణాలు లేవని అంటున్నారు. ఇక లోకేష్ సారధ్యం కూడా గంటాకు అసలు సరిపడని వ్యవహారం అని చెబుతున్నారు. దీంతో ఆయన తన రాజకీయాన్ని వైసీపీ వైపు మళ్ళించారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే డిసెంబర్ 1వ తేదీ గంటా పుట్టిన రోజు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తంగా ఎంచుకున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి జగన్ సభ విశాఖపట్నంలో ఉంది. ఆ సందర్భంగా జగన్ సమక్షంలో వైసీపీలో గంటా పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. మొత్త్తానికి చూస్తే గంటా శ్రీనివాసరావు రాజకీయం ఇపుడు విశాఖ జిల్లాలను షేక్ చేసేలా ఉంది. అంగబలం అర్ధం బలం దండీగా ఉన్న గంటాకు ఉత్తరాంధ్రా అంతా పట్టుంది.

పైగా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతోనే జగన్ ఆయన్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి స్కెచ్ వేశారని అంటున్నారు. విశాఖ సిటీలో పట్టు సాధించేందుకు కూడా ఇది ఉపయోపడుతుంది అని తెలుగుదేశానికి అక్కడ దెబ్బ కొట్టవచ్చు అని కూడా వైసీపీ లెక్క వేస్తోంది అని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News