ఆయన ఇంటి పేరు గంటా. ఆయన రాజకీయాల్లో ఎపుడూ మోగేది జే గంట. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా విజయం తధ్యం. పార్టీలు వేరు అయినా ప్రాంతాలు వేరే అయినా గంటా శ్రీనివాసరావు నిలబడితే మాత్రం ఓటమి అన్నది చూడరంతే. అలా ఆయన తన పొలిటికల్ జర్నీని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే ఆయన విపక్షంలో కూర్చున్నారు. 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గా గెలిచిన ఆయన మంత్రి కావాలనుకున్నారు. కానీ టీడీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో విపక్షంలో ఉండాల్సి వచ్చింది.
ఇక 2009 నాటికి ప్రజారాజ్యంలో చేరి చక్ర్తం తిప్పారు. కానీ ఆ పార్టీ కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే సాధించడంతో ఆశ తీరలేదు. అయితే కాంగ్రెస్ లో పీయార్పీ విలీనం కావడంతో తొలిసారి మంత్రిగా గంటా తన కోరిక తీర్చుకున్నారు. 2014 నాటికి విభజన ఏపీలో రాజకీయం మారింది. కాంగ్రెస్ వీక్ అయింది. అంతే ఆయన తిరిగి కన్వీయినెంట్ గా టీడీపీలోకి జంప్ చేసి మరీ మంత్రిగా అయిదేళ్ళు రాజ్యం చేశారు.
అలా చూసుకుంటే 2019 ఎన్నికల నాటికి గంటా వైసీపీలోకి రావాలి. ఏ పార్టీ గాలి బాగా వీస్తే ఆ పార్టీ వైపు చూసే ఆయనకు ఎందుకో అక్కడ బెర్త్ కన్ ఫర్మ్ కాలేదు. ఆయన అనుచరులు అవంతి శ్రీనివాసరావు ముందస్తుగా వెళ్ళి చేరిపోవడంతో గంటాకు వైసీపీ నో చెప్పింది అని అంటారు. దాంతో రెండవసారి ఆయన విపక్షంలోకి వచ్చారు.
ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరి గంటా సార్ ఏం చేస్తారు అంటే ఆయన రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు అని అంటున్నారు. ఆయన తాను గెలిచిన ఉత్తరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణాలు చూపించారు. అయితే అది స్పీకర్ వద్ద పెండింగులో ఉంది. అలా ఆయన ఈ రోజుకీ ఎమ్మెల్యే. ఇక చంద్రబాబు సిట్టింగులు అందరికీ టికెట్లు అని ప్రకటించారు. ఆ విధంగా చూస్తే గంటా టికెట్ కి ఢోకా లేదు.
అయినా ఆయన టీడీపీలో ఉంటూ వేరే పార్టీలలో చేరేందుకు రాయబేరాలు చేస్తున్నారా అన్న చర్చ వస్తోంది. గంటా వైసీపీలో డిసెంబర్ నెలలో చేరుతారు అన్న ప్రచారం సాగింది. సడెన్ గా దానికి బ్రేక్ పడింది. దీనికి ముందు ఆయన జనసేనలో చేరుతారు అని కూడా అనుకున్నారు. అది కూడా జరగలేదు. ఆ మధ్యన బీజేపీ అన్నారు. అది కూడా ఎందుకో జరగలేదు. మొత్తానికి గంటా ఏ పార్టీలో చేరుతారు అన్నది పెద్ద చర్చ. అది ఎపుడూ సాగే చర్చ.
దానికి ఆయన నుంచి జవాబు కానీ వివరణ కానీ ఉండదు. ఆయన ఈ ప్రచారాన్ని లైట్ తీసుకుంటారు. అదే టైంలో ఫలనా పార్టీలోకి గంటా అంటూ ఇంకో కొత్త ప్రచారం వస్తుంది. ఏది ఏమైనా గంటా ఆలోచనపు ఎపుడూ అధికారంలోకి వచ్చే పార్టీ వైపే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఏపీ రాజకీయం కొంత అయోమయంగా ఉంది.
ఈ రోజుకు చూస్తే ఎవరు గెలుస్తారు అని చెప్పలేని పరిస్థితి. ఇక గంటా కూడా అంతా గమనిస్తున్నారు అని అంటున్నారు. ఆయన తాజాగా వైసీపీలోకి చేరాలని చేసిన ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఆయన మరోసారి జనసేనలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. అలాగే చూస్తే బీజేపీతోనూ టచ్ లో ఉన్న్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా గంటా రాజకీయం ఎపుడూ వార్తలలో ఉండడమే హైలెట్. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఏ నియోజకవరం నుంచి పోటీ చేస్తారు అని ఎవరూ ఈ టైం లో అడగవద్దు అనే అంటున్నారు. ఎందుకంటే అది ఆయన అనుచరులకు కూడా తెలియదని సెటైర్లు పడుతున్నాయట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.