ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి గంటా శ్రీనివాసరావు, వైకాపా ఎమ్మెల్యే రోజా మధ్య ఆసక్తికరమైన మాటల యుద్ధం జరిగింది. నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై రోజా మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయని..ఈ పాలనలో మహిళలకు అస్సలు రక్షణలేకుండా పోయిందన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నాక నాలుగు రోజులకు గాని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించలేదని..తర్వాత హడావిడిగా ఓ ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకున్న ఆయన తర్వాత ఈ కేసును పట్టించుకోకుండా మరుసటి రోజే హడావిడిగా హైదరాబాద్ వెళ్లి శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారని విమర్శించారు.
రోజా వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ శ్రీమంతుడు సినిమా నిర్మాతలు తనకు మిత్రులని..అలాగే ఈ సినిమాల ఊరును దత్తత తీసుకోవడం అనే సోషల్ కాన్సెఫ్ట్ తో తెరకెక్కిందని తన మిత్రులు చెప్పారని... ఆ సినిమాలో ప్రజలకు మంచి చేసే సందేశం ఉన్నట్టు తెలుసుకుని కావాలనే ఆ ఫంక్షన్ కు వెళ్లినట్టు గంటా చెప్పారు. అయినా ఇది వ్యక్తిగత అంశమని...రోజాలాగా తాను జబర్దస్త్ ప్రోగ్రామ్ కు వెళ్లలేదని గంటా ఎద్దేవా చేశారు. అలాగే రోజాలా తాను నగరి నుంచి హైదరాబాద్ కు పాదయాత్రలు కూడా చేయలేనని గంటా విమర్శలు గుప్పించారు.
ఇక రోజా వ్యాఖ్యలపై టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే కుల సంఘాలు అధికమయ్యాయని..మహిళల ఆత్మగౌరవం అనేది టీడీపీకే బాగా తెలుసని..ఓ మహిళ అయ్యి ఉండి రోజా శవ రాజకీయం చేయడం తగదని విమర్శించారు. పామర్రు వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ టీడీపీ పాలనలో యూనివర్సిటీల్లో కులగజ్జి అధికమైపోయిందని విమర్శించారు.
పోన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే యూనివర్సిటీల్లో కుల సంఘాల ప్రభావం ఎక్కువైందని..గతంలో కాంగ్రెస్ పాలనలో ఆయేషామీరాను ఆ పార్టీకి చెందిన నాయకుల బంధువులే చంపినట్టు ఆమె తల్లిదండ్రులే స్వయంగా చెప్పారని..వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ విద్యార్థి నగ్న వీడియోలు కూడా తీసినట్టు చెప్పి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైన విషయం రోజాకు గుర్తులేదా అని నరేంద్ర ధ్వజమెత్తారు.