కూర్చోబెట్టి మాట్లాడాలే కానీ రాజకీయ నేతలు చెప్పే విషయాలుచాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిత్యం విమర్శలు.. ప్రతివిమర్శలతో పాటు.. ఆవేశంతో చెలరేగిపోయే నేతల్లో సున్నితమైన కోణాలు ఉంటాయా? వారిలో భావోద్వేగాలు భారీగా ఉంటాయా? లాంటి ప్రశ్నలు రాక మానవు. తాజాగా ఒక మీడియా ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావులో అలాంటి కోణమే ఒకటి బయటకు వచ్చింది.
మీడియా అధినేత ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. అధినాయకుడు ఎవరైనా సరే.. వారితో ఇట్టే కలిసిపోవటమే కాదు.. వారి మంత్రివర్గంలో చోటు సంపాదించటం లాంటి మేజిక్ గంటా శ్రీనివాసరావు సొంతం. ప్రజారాజ్యంలో పెద్దపీట వేయించుకోవటం.. ఆ పార్టీ కాంగ్రెస్ లో వీలీనమైతే.. మిగిలిన నేతల్ని కాసేపు పక్కన పెడితే మంత్రి పదవిని పొందటం గంటా ప్రత్యేకత. అంతేకాదు.. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో చేరటమే కాదు.. ఎమ్మెల్యేగా గెలిచి బాబు సర్కారులోనూ మంత్రిగా బాధ్యతలు చేపట్టటం లాంటివి ఆయనకే సాధ్యమని చెప్పాలి.
చిరంజీవికి ఎంతో క్లోజ్ అయిన గంటా.. చిరు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీడీపీలో చేరే విషయంలో ఆయన ఎలాంటి ఇబ్బందికి గురయ్యారు? తనకు ఎంతో క్లోజ్ అయిన చిరును ఎలా కన్వీన్స్ చేశారు? తాను పార్టీ నుంచి వెళ్లిపోతే.. చిరంజీవికి ఎంతోకొంత ఇబ్బంది ఉంటుందని తెలిసినా.. చిరు మనసును నొప్పించకుండా టీడీపీలో చేరారు? లాంటి ప్రశ్నలు గంటాను దగ్గర నుంచి చూసేవాళ్లకు వచ్చే డౌట్స్. కానీ.. వాటికి సమాదానాలు దొరక్కున్నా.. కొన్ని సందేహాలకు మాత్రం సమాధానాల్ని మాత్రం తాజా ఇంటర్వ్యూ ఇచ్చిందని చెప్పాలి.
తాను రెగ్యులర్ రాజకీయ నేతను కాకపోవటంతో మిగిలిన పార్టీల వారితోనూ ఫ్రెండ్లీగా ఉండే నేచర్ ఉన్న గంటా.. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లటం తెలిసిందే. అందరితో స్నేహపూర్వకంగా ఉండటం తనకు అలవాటని.. ఇక చిరంజీవి విషయానికి వస్తే తమది ప్రత్యేకమైన బంధంగా అభివర్ణించారు. తనను చిరంజీవి అబ్బాయ్ అని పిలిచేవారని.. కాంగ్రెస్ ను విడిచిపెట్టి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లినట్లుగా చెప్పారు.
ఉదయం తొమ్మిదింటికే చిరంజీవి ఇంటికి వెళ్లానని.. గంటలు గడుస్తున్నా తాను మాత్రం బయటకు రాలేకపోయినట్లుగా వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు కానీ బయటకు రాలేదన్న గంటా.. చిరంజీవి తాను.. ఏడుస్తూ ఉండిపోయామని. రేపొద్దున నుంచి నువ్వో పార్టీ.. నేనో పార్టీ.. అంటూ ఒకరిని ఒకరు ఓదార్చుకున్నామని.. అయితే నేను జగన్ పార్టీలోకి కాకుండా చంద్రబాబు పార్టీలోకి వెళ్లటం చిరంజీవిని సంతోషానికి గురి చేసినట్లుగా చెప్పుకొచ్చారు. రాజకీయాలు చాలా కఠినంగా ఉంటాయని.. తమ ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎలాంటి మొహమాటాలకు నేతలు గురి కారని చెప్పే మాటలకు భిన్నంగా గంటా ఎపిసోడ్ ఉండటం కనిపిస్తుంది.