విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సడెన్ గా మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని చెబుతున్నా ఊరకే గంటా ఇలా భేటీలు వేయరని అంటున్నారు. చాలా కాలంగా గంటా సైలెంట్ గా ఉన్నారు. ఆయన టీడీపీలో మాజీ మంత్రి. సిట్టింగ్ ఎమ్మెల్యే. అయినా సరే ఆయన మౌనమే నా భాష అంటూ వస్తున్నారు.
ఆయన ఉత్తరాంధ్రా టీడీపీలో బిగ్ షాట్. ఆయన మూడేళ్ల కాలంగా టీడీపీలో పెద్దగా కనిపించకపోయినా యాక్టివిటీ చేయకపోయినా ఆయన టికెట్ కి అయితే ఢోకా లేదు. అలాగే ఆయన అనుచరులకు కూడా ఏ పార్టీలో అయినా టికెట్లు ఇప్పించుకోగల సామర్ధ్యం ఆయనకు ఉంది. అందువల్ల ఆయన ఇపుడు రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు. వైసీపీ ఏలుబడిలో సైలెంట్ మంత్రాన్నే ఆయన నమ్ముకున్నారు.
ఆ మధ్యన స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా అని ప్రకటించినా ఆ తరువాత ఆ ఊసు కూడా ఎత్తలేదు. ఏది ఏమైనా గంటా రాజకీయ చాణక్యుడు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. అన్నట్లు ఆయన ప్రజారాజ్యం పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రాలో ప్రజారాజ్యానికి ఆయన అండగా నిలబడ్డారు. అర్ధబలం అంగబలం పుష్కలంగా కలిగిన గంటా ఏ వైపు ఉన్నా అజేయుడుగా తాను ఉంటారని చెబుతారు.
అలాంటి గంటా మెగానుబంధం కూడా చాలా గొప్పదే. అన్నయ్య అంటూ చిరంజీవిని పిలిస్తూ చనువుగా ఉండే గంటా గాడ్ ఫాదర్ హిట్ అయిన సందర్భంగా అభినందించడానికి మెగాస్టార్ ని కలిశారు అని గంటా వర్గం అంటోంది. ఇది జస్ట్ కర్టెసీ కాల్ అని చెబుతున్నారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా మీద నెగిటివ్ విమర్శలు చేసిన ఒక వర్గం మీడియా తరఫున ఆయన రాయబారం నడిపి మెగా కోపాన్ని తగ్గించడానికి వెళ్లారని అంటున్నారు. అంటే ఆయన టీడీపీ తరఫున రాయబారానికి వెళ్లారని అంటున్నారు.
కానీ ఈ వార్తలు కూడా నిజం కాకపోవచ్చు. తెలుగు నాట మీడియా గురించి వాటి పోకడల గురించి మెగాస్టార్ కి తెలియనిది కొత్తగా ఏమీ లేదని, ఆయన సినిమా హిట్ అయిందని, ఆ జోష్ లో ఉన్నారని, గంటా వచ్చి కలిసింది కూడా అందులో భాగంగా అయినా ఇంకా వేరేవి కూడా ఉండొచ్చు అంటున్నారు. ఆ వేరేవి ఏంటి అంటే మెగా స్టార్ పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం ఊపందుకున్న వేళ గంటా మళ్లీ ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు.
గంటా ఉత్తరాంధ్రా జిల్లాలలో దిగ్గజ నాయకుడు. ఆయన చిరంజీవి ఎంత అంటే అంత అనే వారు. అలాంటి గంటా చిరంజీవిని కలిశారు అంటే చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారు అన్న దానికి బలం చేకూరుతోంది అని అంటున్నారు. ఒక వేళ జనసేన ద్వారా మెగాస్టార్ ఎంట్రీ ఇస్తే గంటా కూడా చేరుతారా అన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో టీడీపీతో పొత్తులు ఉంటే కనుక గంటా ఉన్న పార్టీ నుంచే చక్రం తిప్పుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా గంటా రోల్ ఇపుడు రాష్ట్ర స్థాయి నేతగానే ఉంది అంటున్నారు.
ఆయన్ని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. అదే టైం లో ఆయన మెగానుబంధంతో మళ్లీ ఏపీలో జోరు చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా గంటా చిరంజీవి భేటీని తక్కువగా చేసి చూడకూడదు అని అంటున్నారు. ఈ భేటీ వెనక ఏమి ఉంది అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అని కూడా అంటున్న వారు చూడాలి. సో వెయిట్ అండ్ సీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.