ఆయన విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి. ఓటమి ఎరుగని వీరుడు. ఆయనే గంటా శ్రీనివాసరావు. ఆయన చాన్నాళ్ళకు రియాక్ట్ అయ్యారు. అది కూడా సొంత పార్టీలో తన ఒకనాటి రాజకీయ ప్రత్యర్ధిగా భావించే మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ విషయంలో. అయ్యన్నను అరెస్ట్ చేసిన విధానం ప్రోటోకాల్స్ కి పూర్తిగా వ్యతిరేకం. ఆయన అరెస్ట్ ని ఖండిస్తున్నాను, వెంటనే భేషరతుగా విడుదల చేయాలి అంటూ గంటా చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇపుడు తెగ వైరల్ అయింది.
నిజానికి గంటా ఈ టైం లో ట్వీట్ చేయడం ద్వారా తనదైన మార్క్ చూపించారు అని అంటున్నారు. ఆయన చాలాకాలంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీలో ఆయన ఉన్నారా లేరా అన్న చర్చ కూడా మరో వైపు జోరుగా సాగింది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్ హాజరైన పరిస్థితి ఉంది. జిల్లాలో కానీ స్టేట్ పార్టీ ఆఫీసులో కానీ జరిగే సమావేశాలకు ఆయన అటెండ్ అవడంలేదు అన్న ప్రచారం ఉంది.
ఇక ఆయన పార్టీ మారడమే తరువాయి అని అంతా అనుకుంటున్న నేపధ్యనంలో గంటా తాను ఉన్నాను అంటూ రియాక్ట్ అయిన తీరే ఇపుడు అయ్యన్న అరెస్ట్ కంటే చర్చగా ఉంది. టీడీపీతో పాటు ఇతర పార్టీలలోనూ ఇపుడు గంటా ట్వీట్ మీదనే చర్చ సాగుతోంది. సీనియర్ టీడీపీ నేత అరెస్ట్ మీద ఆయన స్పందించిన తీరు టీడీపీకి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా ఒక వైపు అయ్యన్నపాత్రుడు మరో వైపు నిలిచి టీడీపీని ముందుకు నడిపించారు.
గత అయిదేళ్ల టీడీపీ జమానాల్లో ఈ ఇద్దరు నేతలే డైనమిక్ లీడర్స్ గా ఉంటూ వచ్చారు. అలాంటిది పార్టీ ఓడగానే గంటా సైలెంట్ అయితే అయ్యన్న దూకుడు చేస్తూనే ఉన్నారు. ఇపుడు అయ్యన్న అరెస్ట్ తో గంటా మౌనాన్ని వీడారు. ఒక విధంగా టీడీపీని కష్టసమయంలో కాచుకోవడానికి తాను ఉన్నాను అన్న సంకేతం పంపించారు అనే అంటున్నారు. అదే విధంగా అయ్యన్నతో కలసి పనిచేయడానికీ ఇది ఒక సూచికగా భావిస్తున్నారు.
ఇలా విశాఖ జిల్లాకు చెందిన అగ్ర నాయకులు ఒక్కటిగా ఉంటే టీడీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. మొత్తానికి గంటా చేసిన ఒక్క ట్వీట్ తో అనేక అర్ధాలను పరమార్ధాలను వెతుక్కుంటున్నారు. ఆయన టీడీపీలోనే కంటిన్యూ అవుతారని, రానున్న రోజుల్లో మళ్ళీ పాత గంటాను చూడబోతారని అంటున్నారు. ఇంతకాలం గంటా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు తప్ప పార్టీకి దూరం కాలేదని కూడా అంటున్నారు.
ఇదిలా ఉండగా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారు అన్న కారణంతో అయ్యనంపాత్రుడుని, ఆయన కుమారుడుని పోలీసులు ఈ రోజు తెల్లవారు జామునే ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. దీని మీద ఎలాంటి నోటీసులు ముందస్తుగా ఇవ్వలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అయ్యన్న తరఫున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.