సార్... సార్... ఈ రోజు నా పుట్టినరోజు. దయచేసి ఈరోజైనా తిట్టకుండా వదిలేయండి సార్. ఇదీ టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో ఓ సీనియర్ మంత్రి చంద్రబాబును బతిమాలుకుంటూ చేసుకున్న విన్నపం. చంద్రబాబును అంతగా వేడుకున్న మంత్రి ఎవరో కాదు - గంటా శ్రీనివాసరావు. గంటా ఏమీ కొత్తగా మంత్రి అయిన వ్యక్తికాదు. గతంలోనూ పలు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన సీనియర్. అలాంటి నేతే తిట్టొద్దంటూ చంద్రబాబును బతిమాలుకున్నారంటే మంత్రులను ఆయన ఎలా ట్రీట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
‘ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా పార్టీ నేతలపైనే జనంలో అసంతృప్తి ఉన్నట్లు నా సర్వేల్లో తేలింది. ఎవరైనా 80 శాతం సంతృప్తికర ఫలితాలు తెచ్చుకోకపోతే మళ్లీ వారికి అవకాశాలు ఇచ్చేది లేదు. మనం చాలా మంచి పనులు చేస్తున్నాం. అన్ని వర్గాల వారికీ అనేక మేలు జరుగుతున్నా వాటి గురించి ప్రజలకు చెప్పడంలో నేతలు విఫలమవుతున్నారు. అలాంటి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని విడిచిపెట్టేస్తా. మీరంతా ప్రభుత్వ పథకాలపై ఉద్యమస్ఫూర్తితో పనిచేసినప్పుడే మళ్లీ మనం అధికారంలోకి వస్తామ’ని బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి ‘మీరు మరింత బాగా పనిచేయాల’ని బాబు సూచించారు. దానికి గంటా ‘సార్...ఇవాళ నా పుట్టినరోజు..దయచేసి ఏమీ అనకండి..విష్ చేయండి’ అనడం విశేషం. దాంతో చంద్రబాబు గంటాను ఏమీ అనకుండా వదిలేశారు.
ఒక సీనియర్ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అసలు చంద్రబాబు ఎదురుగా నిలిచి మాట్లాడే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. టీడీపీలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/