క్రికెట్ మైదానంలో సత్తా చాటుకున్నట్లే...రాజకీయ పోరులోనూ తన ముద్ర వేసుకోవాలని భావించిన బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ కు ఆదిలోనే షాకులు తగులుతున్నాయి. గౌతమ్ గంభీర్ ఈస్ట్ ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి మంగళవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పోరుపై సమస్యలు వచ్చిపడుతున్నాయి. గౌతమ్ గంభీర్ నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓ వైపు ఈ సమస్య కొనసాగుతుండగానే...గంబీర్ రెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నట్లుగా పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేసింది.
బీజేపీ నుంచి క్రికెటర్ గౌతం గంభీర్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా అతిషి పోటీ పడుతున్నారు. గౌతం గంభీర్ ఓటరు గుర్తింపు కార్డులపై అతిషి ఆరోపణలు చేశారు. ప్రక్క ప్రక్క నియోజకవర్గాల్లో గౌతం గంభీర్ రెండు ఓటరు ఐడీ కార్డులను కలిగి ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. కరోల్ బాగ్ - రాజేంద్రనగర్ రెండు ప్రాంతాల నుంచి గౌతం ఓటరు కార్డులను కలిగి ఉన్నాడని తెలిపింది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నాడని తెలిపింది. సెక్షన్ 17 - 31 ప్రకారం నామినేషన్ సందర్భంగా తప్పుడు నివేదిక సమర్పించిన కారణంగా గౌతం శిక్షార్హుడు అనిన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ క్రిమినల్ ఫిర్యాదు చేసినట్లు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. తప్పుడు నివేదిక సమర్పరణకు శిక్ష ఏడాది జైలు అన్నారు.
కాగా, ఈ ఫిర్యాదుపై బీజేపీ ఘాటుగానే స్పందించింది... గంభీర్ పై అనవసర వివాదాలు సృష్టించేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై గౌతం ఇంకా స్పందించలేదు. తూర్పు ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ మహేష్ గిరీని కాదని ఇటీవలే పార్టీలో చేరిన గంభీర్ ను బీజేపీ వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చింది. అయితే, గంభీర్ నామినేషన్ వేసిన నాటి నుంచి ఏదో ఓ వివాదం తెరమీదకు వస్తోంది.