ఇంగ్లండ్‌తో జరగబోతున్న టీ20 మూడో మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ను తప్పించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఇషాంత్ కిషన్, సూర్యకుమార్ కు ఈ టీ20 ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ లో ఆడే అవకాశం వచ్చింది. అయితే రెండో టీ20లో ఇషాంత్ కిషన్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసిన ఇషాంత్ భారతజట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ కు ఆడే అవకాశం రాలేదు.
ఇదిలా ఉంటే మూడో టీ20 మ్యాచ్ కు రోహిత్ శర్మను తీసుకున్నారు. దీంతో సూర్యకుమార్‌ను పక్కనపెట్టారు. అయితే రాహుల్‌ను తప్పిస్తారని అంతా భావించారు. కానీ రోహిత్ కోసం సూర్యకుమార్ ను తప్పించడం పట్ల సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ అంశం పై మాజీ క్రికెటర్ గంభీర్ కూడా స్పందించారు. కనీసం సూర్యకుమార్ ఆడే అవకాశం ఇవ్వకుండా అతడిని ఎలా పక్కకు పెడతారంటూ గంభీర్ విమర్శించారు. గంభీర్ ఇంకా ఏమన్నాడంటే..
‘ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం నన్నేంతో ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్య కుమార్‌కు ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి ప్లేస్‌లో ఇంకెవరినైనా పక్కకు పెట్టాల్సింది. మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఇటువంటి టైంలో ఈ నిర్ణయం ఏ మాత్రం సరైంది కాదు. సూర్యకుమార్‌కు గాయాలు లేవు. అతడికి అవకాశమే రానప్పుడు అతడి బ్యాటింగ్ తీరును ఎలా అంచనావేస్తాం’ అంటూ గంభీర్ ఫైర్ అయ్యారు. సూర్య కుమార్ కు ఒక్క అవకాశం ఇచ్చి అతడు ఎలా ఆడతాడో చూడాల్సింది అంటూ గంభీర్ పేర్కొన్నారు.
శ్రేయస్ అయ్యర్ తో ఐదో స్థానం కోసం సూర్య కుమార్ యాదవ్ పోటీ పడుతున్నాడు. ఫస్ట్ టీ20లో 67 పరుగులతో ఆకట్టుకున్న శ్రేయస్.. తర్వాత మ్యాచ్‌ల్లో వరుసగా 8, 9 పరుగులతో నిరాశపర్చాడు. దీంతో అతని స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆ స్థానంలో ఓ బ్యాకప్ ప్లేయర్ ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక మూడో టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేదు దీంతో చిత్తుగా ఓడింది. సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 8 వికెట్లతో ఘన విజయాన్నందుకొని సిరీస్ లో 2-1తో ముందంజ లో నిలిచింది. ఇవాళ నాలుగో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ ఇండియాకు చావో రేవో లాంటిది.