నమ్మశక్యంగా లేకున్నా నిజం. ఏపీ ముఖ్యమంత్రి బావమరిది కమ్ వియ్యంకుడైన బాలయ్య మైల్ స్టోన్ చిత్రమైన శాతకర్ణిని ప్రదర్శిస్తున్న థియేటర్ ను తాజాగా అధికారులు సీజ్ చేయటం సంచలనంగా మారింది. సంక్రాంతి పండక్కి బాలకృష్ణ సినిమా రావటం.. చిరు.. బాలయ్యల చిత్రాలు పోటాపోటీగా విడుదలైన వేళ.. ఊహించని రీతిలో సినిమా థియేటర్ ను సీజ్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయానికి వస్తే.. ఒకటి నిబంధనల ప్రకారమే సీజ్ చేశారని చెబుతుంటే.. మరోవైపు టీడీపీలోని నేతల మధ్య నడుస్తున్న అంతర్గత పోరుకు ఫలితమే తాజా ఉదంతంగా చెబుతున్నారు.
ఏలూరులో నెలకొన్న స్థానిక రాజకీయాల కారణంగానే శాతకర్ణిని ప్రదర్శిస్తున్న థియేటర్ ను సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. కామవరపుకోట మండలం తడికల పూడిలో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్ ను చీప్ విప్ చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఓపెన్ చేశారు. తొలిరోజు ఖైదీనంబరు150 సినిమాను స్టార్ట్ చేయగా.. తర్వాతి రోజు బాలయ్య శాతకర్ణి సినిమాను వేశారు. అయితే.. నిబంధనలకు తగినట్లుగా థియేటర్ లేదన్న కారణంగా అధికారులు థియేటర్ ను సీజ్ చేయటం గమనార్హం.
థియేటర్ సీజ్ వెను మంత్రి పీతల సుజాత ఉన్నారని.. మంత్రిగా ఉన్న ఆమెను పక్కన పెట్టి.. థియేటర్ ను చీప్ విప్ ప్రారంభించటంపై రగిలిన ఆమె.. అధికారుల చేత.. చట్టం తన పని తాను చేసుకునేలా చేశారన్న వాదన వినిపిస్తోంది. అయితే.. అలాంటిదేమీ లేదని.. థియేటర్ ను నిబంధనల ప్రకారం నిర్మించలేదన్న మాటను చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూలోకి మంత్రి అయ్యన్న పాత్రుడు ఎంటరై.. ఇరువర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు.. తాను ఎవరిని థియేటర్ ను సీజ్ చేయమని చెప్పలేదని ఆమె చెబుతున్నారు. మరీ.. విషయం బాలకృష్ణకు తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/