నిన్న జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉన్నదని సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌ను వెంటనే టీంఇండియాకు కెప్టెన్ చేయాలంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్లో రోహిత్ అద్భుతమైన కెప్టెన్సీతో రాణిస్తుంటే.. గాయం ఉందన్న సాకుతూ అతడిని పక్కన పెట్టడం ఏమిటని రోహిత్ ఫ్యాన్స్ స్పందించారు. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. రోహిత్ పై ప్రశంసలు కురిపించాడు.
‘రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడిని భారత వన్డే జట్టుతో పాటు టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించాలి. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలోనే రోహిత్ అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఒకవేళ అతడికి ఇప్పటికీ వన్డే, లేదా టీ20 కెప్టెన్సీ అప్పగించకవడం సిగ్గుపడాల్సిన విషయం. కనీసం టీ20లకైనా రోహిత్‌ను కెప్టెన్ చేయాలి’ అని గంభీర్ ట్వీట్ చేశాడు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ఆటతీరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. బుమ్రా, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించడంతో శ్రేయాస్ జట్టు కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. 157 పరుగుల టార్గెట్‌ను ముంబై సునాయాసంగా ఛేదించింది. రోహిత్(68) క్లాసీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.