కోహ్లీని తప్పించండి.. లేదంటే ఆర్​సీబీ పోటీలో కూడా ఉండదు..

Update: 2020-11-08 00:30 GMT
ప్లే ఆఫ్స్​లో జరిగిన కీలకమ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుపై కోహ్లీ సారథ్యంలో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఆర్​సీబీ ఫ్యాన్స్​ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘కోహ్లీ ఇక తప్పుకో’ అంటూ శనివారం ఉదయం నుంచి సోషల్​మీడియాలో మారు మోగిపోతున్నది. ఐపీఎల్ 2020 నుంచి ఆర్​సీబీకి నిష్క్రమించడంతో ఆర్​సీబీ అభిమానులు రగిలిపోతున్నారు. ఈ సారి అయినా ఫైనల్​కు చేరి విజేతగా నిలవాలన్న కల నెరవేరకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. బెంగళూరు 13 ఏళ్లుగా ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ.. ఒక్కసారి కప్ కొట్టలేకపోయింది. దీంతో అభిమానులను ఆవేదన చెందుతున్నారు.'విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ లీగ్‌లో విజేతగా నిలవలేదు' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్​ అవుతున్నాయి.

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా బెంగళూరు సారథి విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించారు. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తీసేయాలని‌ అభిప్రాయపడ్డాడు. గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ... 'ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవకుండా 8 ఏళ్లు ఒక వ్యక్తి కెప్టెన్​గా కొనసాగడం చాలా ఎక్కువ. రవిచంద్రన్‌ అశ్విన్‌ని చూడండి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు రెండేళ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. ఫలితం అనుకూలంగా లేకపోవడంతో తప్పించారు. మనం ఎలాగైతే రోహిత్ శర్మ‌, ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడతామో.. విరాట్ కోహ్లీ కూడా అంతే. ధోనీ చెన్నైకి మూడు సార్లు, రోహిత్‌ ముంబైకి నాలుగుసార్లు టైటిల్స్‌ అందించారు. అందుకే ప్రాంచైజీలు వారిని ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. వారి సారథ్యం కూడా బాగుంది' అని చెప్పాడు.ఒకవేళ రోహిత్‌ శర్మ ఇలాగే ఎనిమిదేళ్లు రాణించకపోయి ఉంటే.. అతడిని కూడా తొలగించేవారే. ఒక్కొక్కరికీ ఒక్కో రూల్ ఉండదు. ఇక్కడ అందరూ సమానమే. మొత్తంగా ఎవరికైనా విజయాలే కావాలి’ అంటూ గంభీర్​ చురకలంటించాడు.

'మేము ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాం, ప్లేఆఫ్స్‌కు వెళ్ళడానికి మేము అర్హులం అని మీరు చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా కాదు. వాస్తవానికి బెంగళూరుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అర్హత లేదు. నాలుగు వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ ప్లేఆఫ్ చేరే అర్హతను కోల్పోయింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదృష్టంగా కొద్దీ సూపర్‌ ఓవర్‌లో గెలిచింది. ఆర్​సీబీ బ్యాట్స్​మెన్​ దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్​ అయిన కోహ్లీ ఏ మాత్రం రాణించలేకపోయాడు. కేవలం డివిలియర్స్​ మీద జట్టు మొత్తం ఆధారపడింది. మంచి బౌలర్స్​ ఉన్నప్పటికీ వారికి ఉపయోగించుకోవడంలో కెప్టెన్​ విఫలమయ్యాడు. ఇది కచ్చితంగా కోహ్లీ తప్పే. అతడిని వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పించాలి’ అని గంభీర్​ పేర్కొన్నాడు. గంభీర్​ వ్యాఖ్యలు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి.
Tags:    

Similar News