కొన్నిసార్లు అంతే.. కాలం అస్సలు కలిసి రాదు. పాపం పండనంత వరకూ ఏం చేసినా నడిచిపోతుంది. కానీ.. ఒక్కసారి సీన్ రివర్స్ అయితే.. ఎంత ముదురు కేసుకైనా ఇబ్బందులే ఇబ్బందులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.. నాటి అఖిలేశ్ సర్కారులో ఒక వెలుగు వెలిగిన ముదురుకేసు గాయత్రి ప్రజాపతి టైం అస్సలు బాగోలేదన్నట్లుగా ఉంది.
ఆ మధ్యన అత్యాచార కేసులో నిందితుడైన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి అరెస్ట్ అయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళలో.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులకు లొంగిపోయారు. ఎన్నికల హడావుడి.. ఆ తర్వాత ఫలితాలతో గాయత్రిప్రజాపతి మీద ఉన్న ఫోకస్ పక్కకు వెళ్లిపోయింది. జైల్లో ఉన్న అతగాడు.. బయటకు వచ్చేందుకు మరో కక్కుర్తి పని చేసి అడ్డంగా బుక్ అయ్యారు.
జైల్లో ఉన్న ఆయన బెయిల్ పొందేందుకు ఏకంగా ఇద్దరు సీనియర్ జడ్జిలతో రూ.10కోట్ల ఒప్పందం చేసుకున్న విషయం తేలినట్లు తాజాగా అలహాబాద్ హైకోర్టు షాకింగ్ వివరాల్ని వెల్లడించింది.మార్చి 15న అరెస్ట్ అయిన ప్రజాపతి.. ఏప్రిల్ 24న బెయిల్ మీద విడుదలయ్యారు.
బెయిల్ మంజూరు మీద ఆరోపణలు రావటంతో దీనిపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ వివరాల్ని తాజాగా హైకోర్టు వెల్లడిస్తూ.. బెయిల్ పొందటానికి సీనియర్ జడ్జిలకు రూ.10 కోట్లకు ఒప్పందం కుదిరినట్లుగా విచారణలో తేలినట్లుగా అలహాబాద్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి దిలీప్ భోస్లే ప్రకటించారు. బెయిల్ అంశం మీద విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసిన అదనపు సెషన్స్ జడ్జి మిశ్రా మరో మూడు వారాల్లో రిటైర్ అవుతారనగా ఏప్రిల్ 7న రాజేంద్ర సింగ్ ఆయన్ను పోస్కో సెక్షన్ కు జడ్జిగా పోస్ట్ చేశారన్నారు.
ఈ ఉదంతంలో పది కోట్ల డీల్ లో రూ.5 కోట్లు బెయిల్ రావటానికి సహకరించిన ముగ్గురు లాయర్లకు లంచంగా ఇచచి.. మిగిలిన రూ. 5కోట్లు మిశ్రా.. రాజేంద్ర సింగ్‌లు పంచుకున్నారన్నారు. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా ఇంటెలిజెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు. రానున్నరోజుల్లో ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/