గేల్‌ ఆ స్టోరీ చెప్పాలంటే 3 లక్షల డాలర్లివ్వాలట

Update: 2017-11-11 08:04 GMT
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ 2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఓ మహిళా థెరపిస్టుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు.. ఆమె హోటల్ గదికి వస్తే ఆమెకు నగ్నంగా కనిపించినట్లు ఆరోపణలు రావడం.. ఈ కేసు ఆస్ట్రేలియాలో కోర్టు దాకా వెళ్లడం.. చివరికి న్యాయపోరాటంలో గేల్ గెలవడం తెలిసిన సంగతే. అసలు తన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి వాస్తవమేంటో.. ఆ న్యూడ్ స్టోరీ సంగతేంటో చెబుతానని అంటున్నాడు గేల్. ఐతే ఇందుకు భారీగా ఖర్చవుతుందని అతను చెప్పాడు.

ఏ మీడియా సంస్థకైనా ఆ స్టోరీ కావాలంటే తనకు కనీసం 3 లక్షల అమెరికన్ డాలర్లు ఇవ్వాలంటూ అతను బేరం పెట్టడం విశేషం. 3 లక్షల డాలర్లకు బిడ్ ఓపెన్ చేస్తున్నానని.. ఇక్కడి నుంచి వేలం పాటలో ఎవరు ఎక్కువ మొత్తానికి బిడ్ వేస్తే వాళ్లకు ఆ స్టోరీ చెబుతానన్నాడు గేల్. ఆ కథంతా చెబితే ఒక సినిమాలాగా ఉంటుందని.. గంట పాటు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ స్టోరీ చెబుతానని గేల్ చెప్పాడు. లేదంటే తాను ఆ వ్యవహారం మీద రాసే పుస్తకం కోసం ఎదురు చూడాలని అతనన్నాడు.

గేల్ మీద ఈ ఆరోపణలు రావడం వెనుక పెద్ద కథే ఉంది. తన మీద దురుద్దేశపూర్వకంగా ఓ ఆస్ట్రేలియా మీడియా గ్రూప్ కథనాలు రాస్తోందంటూ భారీ మొత్తానికి ఆస్ట్రేలియా కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీంతో ఆ సంస్థ ఓ మహిళ థెరపిస్టు గేల్ మీద చేసిన ఆరోపణల్ని తెరమీదికి తీసుకొచ్చింది. గేల్ ను ఇరుకున పెట్టడానికి.. అతడితో పరువు నష్టం దావా వెనక్కి తీసుకునేలా చేయడానికి ఆ సంస్థ కావాలనే గేల్ మీద ఈ ఆరోపణలు చేయించిందన్న అనుమానాలున్నాయి. దీని గురించే గేల్ వివరంగా చెబుతానని అంటున్నాడు.
Tags:    

Similar News