ఏ మాత్రం అచ్చి రావటం లేదంటూ ప్రచారం జరుగుతున్న ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవికి సంబంధించిన కొత్త ఛైర్మన్ ఎంపిక పూర్తి అయినట్లే. ఈ పదవిని చేపట్టిన ప్రతిఒక్కరూ వివాదాల్లో కూరుకుపోవటమో.. మరొకటో జరుగుతున్న నేపథ్యంలో ఈ పదవిని చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించటం లేదన్న ఆరోపణ ఉంది. అలాంటిదేమీ లేదన్న రీతిలో ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి ప్రయత్నించటం.. దానికి కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పేయటం జరిగింది.
పేరుకు ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఈ పదవికి నామినేషన్లు వేసినప్పటికీ.. గీతారెడ్డికే ఈ పదవి వరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిని చేపట్టేందుకు గీతారెడ్డితో పాటు.. నామినేషన్ వేసిన జీవన్ రెడ్డి.. ఈ పదవిని చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. కాంగ్రస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఒత్తిడి మేరకే ఆయన నామినేషన్ వేసినట్లుగా చెబుతున్నారు. సామాజిక కోణంతో పాటు.. సీనియర్ గా.. మహిళగా గీతారెడ్డి ఈ పదవికి సరిగ్గా సరిపోతారన్న మాట వినిపిస్తోంది. తాజా ఎంపికతో.. తెలంగాణ సర్కారు మహిళలకు పెద్ద పీట వేయటం లేదన్న విమర్శలున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని అప్పజెప్పటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.