టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్

Update: 2022-02-24 06:10 GMT
మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకాలానికి మేల్కొంది. తన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న సాంకేతిక సహకారాన్ని తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్తులను జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా గుర్తించి పరిరక్షించుకోవాలని తాజాగా నిర్ణయించింది. టీటీడీ జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో నిపుణులు జియో ఫెన్సింగ్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

హైదరాబాద్ లోని నీర్ ఇంటరాక్టివ్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా జియో ఫెన్సింగ్ సర్వే ఏర్పాటు జరిగింది. ప్రయోగాత్మకంగా తమకు ఎదురైన ఫీడ్ బ్యాక్ ను కంపెనీ యాజమాన్యం టీటీడీకి డీటైల్డ్ గా పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో వివరించింది. ప్రాధాన్యతా క్రమంలో టీటీడీ ఆస్తులను విభజించి జియో సర్వే, జియో మ్యాపింగ్, జియో ఫెన్సింగ్ చేయాలని జేఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆస్తుల పరిరక్షణకు నిరంతర టాస్క్ ఫోర్స్ ఉండాలని టీటీడీ ఎస్టేట్+సెక్యురిటి అధికారులను జేఈవో ఆదేశించారు. ఎక్కడెక్కడ టీటీడీ ఆస్తులున్నాయో అక్కడల్లా వీల్లున్న చోట్ల మెక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.

ఖాళీ స్ధలాలకు ఫెన్సింగ్ వేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడెక్కడ తనకు ఆస్తులున్నాయో టీటీడీకి అయినా తెలుసా ? అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు భూములు, భవనాల రూపంలో ఆస్తులను టీటీడీకి ఇచ్చేస్తుంటారు.

వీటిల్లో కొన్ని క్లీన్ రికార్డులున్నవి ఉంటాయి మరికొన్నింటిలో ఏదన్నా వివాదాలు ఉండేవి కూడా ఉంటాయి. ఏదేమైనా ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఒకసారి టీటీడీకి అందితే ఇక సదరు ఆస్తులు టీటీడీ పరమైపోతాయి. ఇలాంటి రూపాల్లో దేశంలోని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా వందలాది భూములున్నాయి.

వాస్తవానికి వీటన్నింటినీ పరిరక్షించటం టీటీడీకి తలకు మించిన పనైపోతోంది. తమిళనాడు, కేరళ, రుషికేష్, ఢిల్లీ, ముంబాయ్, వారణాశి లాంటి ఎన్నో ప్రాంతాల్లోని భూములు ఆక్రమణకు గురయ్యాయి. అందుకనే టీటీడీ హఠాత్తుగా కబ్జాకు గురవుతున్న ఆస్తుల రక్షించుకునేందుకే జియో ఫెన్సింగ్ ప్రక్రియ మొదలు పెట్టింది.
Tags:    

Similar News