కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనేది ఎంత నిజమో.. కసి ఉన్నా కూడా రుషులవుతారని నిరూపించాడు జార్జ్ వి. నేరిపరంబిల్. తన స్నేహితుడు అపహాస్యం చేశాడని, అవమాన పరిచాడనె కారణంతో కసి పెంచుకుని కష్టపడ్డాడు.. జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిల్డింగ్ వద్ద ఒకప్పుడు మెకానిక్ గా పని చేసిన జార్జ్ వీ.నేరీపరంబిల్ ఇప్పుడు బడా బిజినెస్ మన్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఇతడున్న పరిస్థితిని చూసి అతని స్నేహితుడితోపాటు అంతా షాక్ అవుతున్నారు.
కేరళకు చెందిన జార్జ్ తో అతడి స్నేహితుడొకరు.. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనాన్ని చూపిస్తూ "ఇందులోకి నీ జీవితంలో వెళ్లలేవు" అంటూ అపహాస్యం చేసి వెకిలి నవ్వులు నవ్వాడట. అంతే.. ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న జార్జ్ జీవితంలో ఎలాగైనా ఇందులోకి ప్రవేశించాలని పంతం పట్టుకున్నాడు. ఇలా ఉండగా 2010 లో ఒకరోజు ఈ బుర్జ్ ఖలీఫాలో ఓ ఫ్లాట్ అద్దెకు ఉన్నట్టు పాత్రికా ప్రకటన రావడంతో, వెంటనే అదే రోజు అక్కడికి చేరుకొని అద్దెకు దిగాడు. అక్కడే ఎయిర్ కండిషనింగ్ వ్యాపారం మొదలు పెట్టిన జార్జ్ ఇప్పుడు జీఈవో గ్రూప్ ఆఫ్ కంపెనీలకు అధిపతి అయ్యాడు.
ఏ బిల్డింగ్ లోకి తన లైఫ్ లో వెళ్లలేవని తన స్నేహితుడు వెటకారమాడాడొ, అదే బిల్డింగ్ లో అద్దెకు దిగి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఆ బుర్జ్ ఖలీఫాలో 22ఫ్లాట్లను సొంతం చేసుకున్నాడు. అంతేనా.. సరైన డీల్ కుదిరితే మరికొన్ని ఫ్లాట్స్ కొంటానని చెబుతున్నాడట. కాగా స్వతాహగా మెకానిక్ అయిన జార్జ్.. తన 11 ఏళ్ళ వయస్సులోనే పత్తి రైతులు పారేసిన విత్తనాల నుంచి గమ్ ను సేకరించడం - అమ్మడంలో తన తండ్రికి సహకరిస్తూ వచ్చేవాడట.
దుబాయ్ దేశానికే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిన ప్రపంచంలోనే ఎత్తయిన బుర్జ్ ఖలీఫా.. 828 మీటర్లు ఎత్తుండి మొత్తం 900 అపార్ట్ మెంట్లు కలిగి ఉన్న సంగతి తెలిసిందే.