సొంత పార్టీ అభ్య‌ర్థికి బుష్ ఓటెయ్య‌లేదు!

Update: 2016-11-09 05:32 GMT
అయితే అటైనా ఉండాలి, లేదంటే ఇటు ఉండాలి... కానీ, ఆయ‌న ఎటూ ఉండ‌ర‌ట‌! ఈసారి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ ఓటు వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న నిర్ణ‌యంతో రిప్ల‌బిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్ కి బుష్ షాక్ ఇచ్చిన‌ట్టే చెప్పాలి. ఎందుకంటే, అదే పార్టీ త‌ర‌ఫు రెండుసార్లు అమెరికా అధ్య‌క్ష పీఠంపై జార్జ్ బుష్ కూర్చున్నారు. అంతేకాదు, ఆయ‌న తండ్రి సీనియ‌ర్ బుష్ కూడా రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫునే గ‌తంలో అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఓర‌కంగా రిప‌బ్లిక‌న్ పార్టీ వారి సొంత పార్టీ. ఆ లెక్క‌న‌, పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్నా బుష్ మ‌ద్ద‌తు ఇవ్వాలి. వారికే ఓటు వెయ్యాలి క‌దా! కానీ, ట్రంప్ అభ్య‌ర్థిత్వంపై మొద‌ట్నుంచీ బుష్ వ్య‌తిరేకంగానే ఉన్నారు. మొత్తంగా బుష్ ఫ్యామిలీ అంతా ట్రంప్ విష‌యంలో త‌మ వైఖ‌రిని ఇంత‌కుముందే స్ప‌ష్టంగా చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే ట్రంప్ కి బుష్ ఓటు వేయ‌డం లేద‌ని నిర్ణ‌యించుకున్నారు.

ట్రంప్ కు ఓటు వెయ్య‌రంటే హిల్ల‌రీకి వేస్తారేమో అనుకుంటాం! కానీ, అలాగూ వెయ్య‌ర‌ట‌! ఈ ఎన్నిక‌ల్లో ట్రంప్ కిగానీ, డెమొక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ కు గానీ ఓటు వెయ్య‌కూడ‌ద‌ని బుష్ నిర్ణ‌యించుకోవ‌డం విశేష‌మే. బుష్ నిర్ణ‌యం ట్రంప్ కి కొంత ఇబ్బందిక‌ర‌మే అని చెప్పాలి. ఎందుకంటే - మాజీ అధ్య‌క్షుడే రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థిని వ్య‌తిరేకిస్తుంటే.. అంత‌కంటే, ఘోరం ఇంకేముంటుంది? అయితే, బుష్ ఓటు వెయ్య‌క‌పోవ‌డాన్ని ట్రంప్ చాలా లైట్ గా తీసుకున్నార‌ట‌. ఆయ‌న ఓటు వెయ్య‌నంత మాత్రాన త‌న గెలుపుపై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌న్న ధీమాతో ఆయ‌న ఉన్నారు. బుష్ నిర్ణ‌యం కాస్త బాధ‌క‌ర‌మైన‌ది అని మాత్ర‌మే ప్ర‌క‌టించారు. రాజుగారి రెండో భార్య మంచిది అంటే... మొద‌టిది కాద‌నే క‌దా అర్థం! సొంత పార్టీ అభ్య‌ర్థికి ఓటు వెయ్య‌నూ అంటే... హిల్ల‌రీకి ఓటు వెయ్య‌క‌పోయినా ఇన్ డైరెక్ట్ గా స‌పోర్ట్ చేస్తున్న‌ట్టుగానే అర్థం చేసుకోవాలి క‌దా! ఏదేమైనా, బుష్ తాజా నిర్ణ‌యం అమెరికాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News