మిషెల్ ఒబామాను ఇష్ట‌ప‌డ్డ బుష్‌

Update: 2017-03-03 12:03 GMT
ఆ ఇద్ద‌రిలో ఒక‌రు అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ ప్రెసిడెంట్‌. మ‌రొక‌రు మాజీ ఫ‌స్ట్ లేడీ. రాజ‌కీయంగా ఇద్ద‌రూ వేర్వేరు పార్టీల‌కు చెందిన‌వాళ్లు. వాళ్ల ప్ర‌భుత్వాలూ వేరు. జ‌న‌రేష‌న్ కూడా వేరే. కానీ వాళ్ల ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆ ఇద్ద‌రే  అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్‌. తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా స‌తీమ‌ణి మిషెల్ ఒబామా. ఆ ఇద్ద‌రి స‌న్నిహిత్య టాక్‌ పై ఉన్న సైలెన్స్‌ ను జార్జిబుష్‌ బ్రేక్ చేశారు. త‌న‌కు మిషెల్ ఒబామా అంటే ఇష్ట‌మ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేశారు.

పోట్రేయిట్స్ ఆఫ్ క‌రేజ్ : ఎ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్స్ ట్రిబ్యూట్ టు అమెరికా వారియ‌ర్స్ అన్న పుస్త‌కాన్ని బుష్ రాశారు. దాన్ని తాజాగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన జార్జ్ బుష్ మాజీ ఫ‌స్ట్ లేడీ మిషెల్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చెప్పారు. తాను వేసే జోకుల‌ను మిషెల్ అమితంగా ఇష్ట‌ప‌డుతుంద‌ని, త‌న సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌ను న‌చ్చిన మిషెల్‌ను తాను కూడా అతిగా ఇష్ట‌ప‌డుతాన‌ని జార్జ్ బుష్ ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.గ‌త ఏడాది టెక్సాస్‌లో జ‌రిగిన నాన్సీ రీగ‌న్ మెమోరియ‌ల్ స‌ర్వీస్‌ లో జార్జ్ బుష్‌, మిషెల్ ఒబామా ప‌క్క‌ప‌క్కనే కూర్చున్నారు. ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్ మ్యూజియ‌మ్‌ ను స్టార్ట్ చేసిన‌ప్పుడు జ‌రిగిన కార్య‌క్ర‌మంలోనూ ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. ఆ టైమ్‌ లో మిషెల్ వెనుక నుంచి జార్జ్ బుష్‌ను ఆత్మీయంగా హ‌త్తుకుంది. జ‌న‌వ‌రిలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం స‌మ‌యంలోనూ బుష్‌, మిషెల్ ఇద్ద‌రూ క్లోజ్‌గా క‌నిపించారు.

ఈ సంఘ‌ట‌న‌ల‌పై సోష‌ల్ మీడియాలో కొంద‌రు భిన్న‌మైన కామెంట్లు చేశారు. దీంతో బుష్ క్లారిటీ ఇచ్చారు. మిషెల్ ఆత్మీయ ప‌ల‌క‌రింపు నిజ‌మైన ప్రేమ‌ను చాటుతుంద‌ని బుష్ అన్నారు. ఎప్పుడూ ఒబామా దంప‌తుల చుట్టు సీరియ‌స్ వ్య‌క్తులు ఉంటుంటారు, కానీ తాను జోకులు వేస్తున్న‌ప్పుడు మిషెల్ ఎంజాయ్ చేస్తుంద‌ని, దాన్ని నేను ఇష్ట‌ప‌డుతాన‌ని బుష్ తెలిపారు. తాము ఇద్ద‌రం ఎప్పుడు క‌లుసుకున్నా జోకులు పేలుస్తూనే ఉంటామ‌ని వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News