ఈ జర్మనీ అమ్మడి ప్రేమ యవ్వారం మామూలుగా లేదుగా?

Update: 2020-01-28 01:30 GMT
ప్రేమను పరమ పవిత్రంగా ఫీలయ్యే వారు కోట్లమంది కనిపిస్తారు. కొందరు మాత్రం ప్రేమను పిచ్చతో పోలుస్తుంటారు. అలాంటోళ్లను చూసినంతనే ఒళ్లు మండుతుంది. కానీ.. తాజా యవ్వారం చూసినప్పుడు మాత్రం అలాంటోళ్ల వెర్షన్ కూడా నిజమే కాబోలు సుమి అన్న భావన కలగటం ఖాయం. ఎవరు.. ఎవరితో ప్రేమలో ఎప్పుడు పడతారో అస్సలు అర్థం కాదు. కానీ.. పోయి.. పోయి ఒక విమానంతో ప్రేమలో పడటమే కాదు.. దాన్ని ఎంచక్కా పెళ్లాడతానని చెప్పి సంచలనంగా మారిందో జర్మనీ పోరి.

చూసేందుకు ఏ మాత్రం లోటు లేనట్లుగా అందంగా ఉన్న ఈ భామకు ఒక విమానమంటే అంతులేని ప్రేమట. అది కూడా రోజో.. రెండు రోజులో.. నెలో కాదు ఏకంగా ఆరేళ్లుగా ఆ విమానాన్ని ఎంచక్కా ప్రేమిస్తోందట  బెర్లిన్ కు చెందిన 30 ఏళ్ల మైకేల్ కోబ్కే అనే మహిళ. తన కలల జెట్ బోయింగ్737ను ఈ ఏడాది మార్చిలో పెళ్లాడనున్నట్లుగా చెప్పి.. నోట మాట రాకుండా చేస్తోంది.

2014లో బెర్లిన్ టెగెల్ ఎయిర్ పోర్టులో ఈ జెట్ విమానాన్ని చూసినంతనే దాని ప్రేమలో పడిపోయానని.. దానికి స్కాట్జ్ అనే ముద్దుపేరు కూడా పెట్టుకున్నట్లు చెప్పింది. ఆరేళ్లుగా ఆ విమానంతో తాను డేటింగ్ చేస్తున్నట్లు చెప్పిన ఆ మహిళ.. మొదట్లో ఈ జెట్ ను కేవలం కిటికి దగ్గరే చూసేదానినని.. 2019 సెప్టెంబరులో ఈ నలభై టన్నుల జెట్ ను తొలిసారి ముద్దు పెట్టుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

అమ్మడి మాటలు వింటే అర్థం కాక.. తల బాదుకునే వాళ్లు కొందరైతే.. ఈ సిత్రమైన ప్రేమగోలేందిరా బాబు? అంటూ అవాక్కు అవుతున్నోళ్లు లేకపోలేదు. విమాన రెక్క మీద కూర్చొని దాన్ని ముద్దాడిన రోజు తన జీవితంలోనే అందమైన క్షణాలుగా చెప్పిన ఆమె.. సదరు విమానంతో తనకున్న ప్రేమానుబంధం గురించి అదే పనిగా చెబుతోంది. విమానంతో ఆమెప్రేమాయణాన్ని ఆమె కుటుంబ సభ్యులే కాదు.. స్నేహితులు కూడా స్వాగతించారట. స్నేహితులన్న తర్వాత ఆ మాత్రం చేయకుండా ఉంటారా? 

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News